US India Relations: అమెరికాలోనిఆ రాష్ట్రాల్లో భారత స్వాతంత్ర్య దినోత్సవానికి అధికారిక గుర్తింపు! గ్లోబల్ గుర్తింపు వివరాలు ఇవే!
US India Relations: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. దీనికి నిదర్శనంగా అమెరికాలోని రెండు కీలక రాష్ట్రాలైన న్యూయార్క్, న్యూజెర్సీలు ఆగస్టు 15వ తేదీని 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా అధికారికంగా ప్రకటించాయి.
- భారత్, అమెరికాల మధ్య ప్రజాస్వామ్య విలువల బంధానికి నిదర్శనమని వెల్లడి..
- భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం..
US India Relations: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు లభిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన చారిత్రక ఘట్టాన్ని గౌరవిస్తూ, అమెరికాలోని రెండు కీలక రాష్ట్రాలైన న్యూయార్క్ మరియు న్యూజెర్సీలు ఆగస్టు 15వ తేదీని 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా అధికారికంగా ప్రకటించాయి.
అమెరికా నిర్మాణంలో మరియు సాంకేతిక, ఆర్థిక అభివృద్ధిలో భారతీయ-అమెరికన్లు వహిస్తున్న రథసారథ్యానికి, వారి భాగస్వామ్యానికి గౌరవసూచకంగా ఈ చారిత్రాత్మక ప్రకటనలు వెలువడ్డాయి.
గవర్నర్ల అధికారిక ప్రకటన: కాన్సులేట్ ధ్రువీకరణ..
న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్, న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెరిల్ ఆగస్టు 15వ తేదీని 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా గుర్తిస్తూ వేర్వేరుగా అధికారిక ప్రొక్లమేషన్లు (ప్రకటనలు) జారీ చేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది.
బలపడిన స్నేహ బంధం: ఈ గుర్తింపు భారత్-అమెరికానా నడుమ ఉన్న ఉమ్మడి విలువలకు, బలమైన ప్రజాస్వామ్య స్నేహ బంధానికి ప్రతీక అని భారత కాన్సులేట్ వ్యాఖ్యానించింది.
భారత స్వాతంత్ర్య పోరాటానికి నివాళి: న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ తన ప్రకటనలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన అహింస పోరాటాన్ని, స్వయం నిర్ణయాధికారం మరియు ప్రజాస్వామ్యం పట్ల భారతదేశానికి ఉన్న దృఢమైన నిబద్ధతను ప్రత్యేకంగా కొనియాడారు.
అమెరికాలో భారతీయ డయాస్పోరా ప్రస్థానం..
న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావవంతమైన భారతీయ-అమెరికన్ సమాజం నివసిస్తోంది. వైద్యం, సాంకేతికత (IT), వ్యాపారం, విద్య, ప్రజా సేవ మరియు సాంస్కృతిక రంగాల్లో వారు అందిస్తున్న విశేష సేవలను ఈ గవర్నర్లు కొనియాడారు.
కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాకుండా, ఇటీవలే మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ, బోస్టన్ మేయర్ మిషెల్ వూ సైతం ఆగస్టు 15ను 'ఇండియా డే'గా గుర్తిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లో సాంస్కృతిక మార్పిడికి, పౌర భాగస్వామ్యానికి భారతీయ సంఘాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అమెరికా నేతలు ప్రశంసించారు.
అమెరికాలో ముమ్మరిస్తున్న భారత సంతతి ప్రభావం:
అధికారిక గణాంకాల ప్రకారం అమెరికాలో సుమారు 5.4 మిలియన్ల (54 లక్షలు) మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఆసియా వాసుల్లో మూడవ అతిపెద్ద సమూహంగా ఉన్న వీరు, ఆర్థికంగా మరియు సామాజికంగా అమెరికా అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ అధికారిక గుర్తింపులు కేవలం సాధారణ ప్రకటనలు మాత్రమే కావు; అమెరికా గడ్డపై భారతీయ డయాస్పోరా సాధించిన మహోన్నత విజయాలకు దక్కిన అంతర్జాతీయ గౌరవం.
Tags
Be the first to react