అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. ట్రంపు కు భారీ దెబ్బ.. వీటో అంటూ ట్వీట్! భారత సంతతి రికార్డు..
US Midterm Elections 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రారంభ ఫలితాలు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న పలు ప్రాంతాల్లోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయాలు సాధిస్తుండటంతో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్, అసెంబ్లీ స్థానాల్లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
- అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్ల ఆధిక్యం.. రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ.
- ఫ్లోరిడాలో పియా దండియా విజయం.. ఓహియోలో వివేక్ రామస్వామి వెనుకంజలో కొనసాగుతున్నారు.
US Midterm Elections 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రారంభ ఫలితాలు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న పలు ప్రాంతాల్లోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయాలు సాధిస్తుండటంతో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్, అసెంబ్లీ స్థానాల్లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
నార్త్ కరోలినాలో డెమోక్రాట్లకు కీలక విజయం
నార్త్ కరోలినా సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి, మాజీ గవర్నర్ రాయ్ కూపర్ విజయానికి చేరువయ్యారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ వాట్లీపై ఆయన స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2008 తర్వాత ఈ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ పార్టీకి సెనేట్ స్థానం దక్కే అవకాశం ఉండటం ఈ ఫలితానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
జార్జియాలో సెనేట్, గవర్నర్ స్థానాలు డెమోక్రాట్ల ఖాతాలోకి
జార్జియా సెనేట్ ఎన్నికల్లో ప్రస్తుత డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఓసాఫ్ మరోసారి విజయం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న గవర్నర్ స్థానాన్ని డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. రాష్ట్రానికి ఎన్నికైన తొలి నల్లజాతీయురాలైన మహిళా గవర్నర్‌గా బాటమ్స్ రికార్డు సృష్టించారు.
ఫ్లోరిడాలో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ
ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయ ప్రయోజనం పొందాలని భావించిన రిపబ్లికన్ల అంచనాలు కొన్ని చోట్ల తలకిందులయ్యాయి. ఫ్లోరిడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లకు ఉన్న మూడింట రెండొంతుల సూపర్ మెజారిటీకి డెమోక్రాట్లు గండికొడుతున్నారు. ఈ విజయాన్ని డెమోక్రటిక్ లెజిస్లేటివ్ క్యాంపెయిన్ కమిటీ అధ్యక్షురాలు హీథర్ విలియమ్స్ చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు.
ట్రంప్‌కు పట్టున్న ప్రాంతాల్లోనూ డెమోక్రాట్ల జోరు
ట్రంప్‌కు బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లోనూ డెమోక్రటిక్ అభ్యర్థులు విజయాలు నమోదు చేయడం ఎన్నికల ఫలితాల్లో మరో కీలక పరిణామం. కెంటకీలోని కాంగ్రెస్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ట్రంప్ 15 శాతానికి పైగా ఆధిక్యం సాధించారు. అయితే ఈసారి అక్కడ డెమోక్రటిక్ అభ్యర్థి జాక్ డెంబో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని 25వ డిస్ట్రిక్ట్‌లో నియోజకవర్గాల పునర్విభజన రిపబ్లికన్లకు అనుకూలంగా జరిగినప్పటికీ డెమోక్రటిక్ ప్రతినిధి జేర్డ్ మోస్కోవిచ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతి అభ్యర్థుల సత్తా
ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న అభ్యర్థులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన పియా దండియా విజయం సాధించారు. 94 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆమెకు 52.2 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌కు 47.8 శాతం ఓట్లు లభించాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ స్థానంలో ఆమె గెలుపును డిసిషన్ డెస్క్ హెచ్‌క్యూ కూడా ధ్రువీకరించింది. కాగా ఈమె ఎన్నికల ప్రచారానికి ఫ్లోరిడాలోని పలువురు తెలుగు వారు కూడా ప్రచారం చేయడం విశేషం.

అమెరికా ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన భారతీయ సంతతి నేత సుహాస్ సుబ్రమణ్యం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మరో నేత సుహాస్ సుబ్రమణ్యం విజయం సాధించారు. వర్జీనియా రాష్ట్రంలోని 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ఆయన మరోసారి అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారుగా పనిచేసిన 40 ఏళ్ల సుహాస్‌కు ఈ ఎన్నికల్లో 61.5 శాతానికి పైగా ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌కు 36.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో సుహాస్ తన స్థానాన్ని నిలబెట్టుకుని మరోసారి కాంగ్రెస్‌లో అడుగుపెట్టనున్నారు.

ఓహియోలో వెనుకంజలో వివేక్ రామస్వామి
ఓహియో గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి ప్రారంభ ఫలితాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ డెమోక్రటిక్ అభ్యర్థి అమీ యాక్టన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అమీ యాక్టన్‌కు 51 శాతం పైగా ఓట్లతో గెలవగా, 44 శాతం ఓట్లతో వివేక్ రామస్వామి పరాజయం పొందినారు.
న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో సరితా కొమ్మారెడ్డి
న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన సరితా కొమ్మారెడ్డి కూడా ఆసక్తికరమైన పోరును ఎదుర్కొంటున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి లెటీషియా జేమ్స్‌తో ఆమె పోటీ హోరాహోరీగా సాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
మొత్తంగా అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రారంభ ఫలితాలు డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. రిపబ్లికన్లకు కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లోనూ డెమోక్రాట్లు పుంజుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన స్థానాల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్‌లో ఇరు పార్టీల బలాబలాలపై మరింత స్పష్టత రానుంది.
Tags
Be the first to react
