టీవీనా.. థియేటరా! 115" భారీ స్క్రీన్‌తో ఎల్‌జీ(LG) కొత్త లాంచ్! అదిరిపోయే ధర

LG Mini LED TV Lauch: 115 అంగుళాల భారీ స్క్రీన్‌తో ప్రీమియం స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అడుగుపెట్టింది. అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ.14,99,990గా నిర్ణయించింది.

LG Launches 115-Inch QNED AI Mini LED 4K Smart TV
LG Launches 115-Inch QNED AI Mini LED 4K Smart TV
  • ఎల్‌జీ(LG) 115 అంగుళాల 4K స్మార్ట్ టీవీని రూ.14.99 లక్షలకు విడుదల చేసింది.
  • 165Hz రిఫ్రెష్ రేట్, ఏఐ ఫీచర్లు, 11.1.2 సరౌండ్ సౌండ్ ప్రత్యేకతలు.

LG Mini LED TV Lauch: 115 అంగుళాల భారీ స్క్రీన్‌తో ప్రీమియం స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అడుగుపెట్టింది. అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ.14,99,990గా నిర్ణయించింది.

టీవీ ప్రత్యేకతలు ఇవే!

ఈ టీవీలో 4K రిజల్యూషన్‌తో కూడిన QNED evo Mini LED డిస్‌ప్లేను ఉపయోగించారు. ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3 సాయంతో చిత్రాల నాణ్యత, రంగులు, కాంట్రాస్ట్‌ను మెరుగుపరుస్తుంది. ప్రెసిషన్ డిమ్మింగ్ అల్ట్రా టెక్నాలజీ చీకటి, వెలుతురు ప్రాంతాలను స్పష్టంగా చూపించేందుకు సహాయపడుతుంది. 100 శాతం కలర్ వాల్యూమ్‌కు ఇంటర్‌టెక్ సర్టిఫికేషన్ కూడా లభించింది.

గేమింగ్ ప్రియుల కోసం ఈ టీవీలో 165Hz వరకు VRR సపోర్ట్, AMD FreeSync Premium, ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM) అందించారు. మోషన్ బూస్టర్ ద్వారా కొన్ని సపోర్టెడ్ మోడ్స్‌లో 330Hz వరకు రిఫ్రెష్ రేట్ పొందవచ్చు. సాధారణ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hzగా ఉంటుంది.

ఆడియో విషయానికొస్తే.. 40W స్పీకర్ సిస్టమ్‌తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఏఐ సౌండ్ ప్రో టెక్నాలజీ ద్వారా వర్చువల్ 11.1.2 ఛానెల్ సరౌండ్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు: webOS 26  ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టీవీలో ఏఐ వాయిస్ ఐడీ, ఏఐ కన్సీర్జ్, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వినియోగదారుల వాయిస్‌ను గుర్తించి వ్యక్తిగత ప్రొఫైల్‌ను అందించే ఫీచర్ కూడా ఉంది. గూగుల్ కాస్ట్, యాపిల్ ఎయిర్‌ప్లే సదుపాయాలు కల్పించారు.

ఈ టీవీని సినిమాలు, క్రీడలు, గేమింగ్‌ను పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు ఎల్‌జీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సొల్యూషన్స్ డైరెక్టర్ బ్రియాన్ జంగ్ తెలిపారు. 

ప్రధాన స్పెసిఫికేషన్లు

LG మోడల్:

115QNED90BL

స్క్రీన్ సైజు:

115 అంగుళాలు (292 సెం.మీ)

డిస్‌ప్లే:

4K QNED Mini LED

రిజల్యూషన్:

3840 × 2160 పిక్సెల్స్

ప్రాసెసర్:

Alpha 8 AI Processor 4K Gen 3

నేటివ్ రిఫ్రెష్ రేట్:

120Hz

VRR:

165Hz వరకు

మోషన్ బూస్టర్:

330Hz వరకు

కలర్ టెక్నాలజీ:

Dynamic QNED Color Pro

HDR:

Dolby Vision, HDR10, HLG

ఆపరేటింగ్ సిస్టమ్:

webOS 26

ఆడియో:

40W, 2.2 ఛానెల్స్

సౌండ్ ఫీచర్లు:

Dolby Atmos, Virtual 11.1.2 Surround

HDMI:

4 పోర్టులు

USB:

2 పోర్టులు

బ్లూటూత్:

5.3

ధర:

రూ.14,99,990

Tags

Be the first to react

Latest