సినిమా ప్రియులకు తీపి కబురు! ఉదయం 6 నుండి అర్ధరాత్రి 2.30 వరకు 6 షోలు! ప్రభుత్వ ఉత్తర్వు!

Tamil Nadu Cinema New Rules: తమిళ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సినిమాల విడుదల సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించే షోల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త సినిమా విడుదలైన తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Tamil Nadu Increases Movie Shows to 6
Tamil Nadu Increases Movie Shows to 6
  • కొత్త సినిమాల విడుదలైన తొలి 7 రోజులు రోజుకు 6 షోలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి.
  • ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 2.30 వరకు షోల ప్రదర్శనకు అవకాశం.

Tamil Nadu Cinema New Rules: తమిళ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త సినిమాల విడుదల సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించే షోల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త సినిమా విడుదలైన తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. కొత్త సినిమాల విడుదలైన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఆరు ఆటలు నిర్వహించుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ ఈ వెసులుబాటు వర్తించనుంది. ముఖ్యంగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం రావడం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు ఊరటనిస్తోంది.

సినీ సంఘాల విజ్ఞప్తితో నిర్ణయం

తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1957 నాటి తమిళనాడు సినిమా (రెగ్యులేషన్) నిబంధనల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలోని థియేటర్లలో రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఉంది.

ఐదు షోల నుంచి ఆరుకు పెంపు

టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సినిమాల విడుదలైన తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశం కల్పించింది. తాజాగా ఆ సంఖ్యను ఆరుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త సినిమాలకు తొలి వారంలో మరిన్ని ప్రదర్శనలు నిర్వహించుకునే అవకాశం లభించనుంది.

సినీ పరిశ్రమ హర్షం

ప్రభుత్వ నిర్ణయంపై నడిగర్ సంఘం, తమిళ సినీ నిర్మాతల సంఘాలు, థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంతో పండుగలు, వారాంతాల్లో కొత్త సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో పాటు నిర్మాతలు, థియేటర్ల ఆదాయానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest