రైలు ప్రయాణమంటే ఇంత రిస్క్ చేయాలా? బోగీ టాప్‌పై ప్రయాణికులు.. వీడియో వైరల్

ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోవడంతో కొందరు ప్రయాణాలను సైతం లేకుండా సముద్రకరంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తున్న మటున అప్పుడు తెలుగు‌లోకి వస్తుంటాయి.

Railway photos
Railway photos

ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోవడంతో కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి.

తాజాగా ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ రైలు స్టేషన్‌లో నిలిచి ఉండగా.. ప్రయాణికులు రైలు బోగీల లోపల కాకుండా ఏకంగా వాటి పైకప్పుపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.

రైలు స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు ఒక్కొక్కరుగా బోగీ పై నుంచి కిందకు దిగుతున్నారు. కొందరు తమ బ్యాగులను ముందుగా కిందకు విసిరేస్తుండగా.. మరికొందరు రైలు పైభాగంలో ఉన్న పైపులను పట్టుకుని జాగ్రత్తగా కిందకు దిగుతున్నారు. ఈ దృశ్యాలు చూస్తే ఏ మాత్రం పట్టుతప్పినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతుంది.

వీరిలో పురుషులతో పాటు మహిళలు, చిన్నారులు కూడా కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న పిల్లలను సైతం బోగీ పై నుంచి కింద ఉన్న ప్రయాణికులకు అందిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రయాణికులు ఎలాంటి భయం లేకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ ఘటన భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో జరిగినట్లు సమాచారం. ‘ఘర్ కి కలాష్’ అనే ఎక్స్ పేజీలో ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోకు ఇప్పటికే భారీగా వ్యూస్ రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలకు సరిపడా రైళ్లను, ముఖ్యంగా జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురావడంలో రైల్వే వ్యవస్థ విఫలమైందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ప్రయాణికులు ఇలా రైలు పైకప్పులపై ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో మరికొందరు గుర్తుచేస్తున్నారు. పైభాగం నుంచి ఒక్కరు జారిపడినా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Be the first to react

Latest