బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి మళ్లీ భారీ వర్షాలు!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల ఆర్నబ్‌ తుపాను అతలాకుతలం చేయగా.. తాజాగా బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్‌ తొలి వారంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Andhra Pradesh Rain Alert in Early November
Andhra Pradesh Rain Alert in Early November
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం.
  • నవంబర్‌ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల ఆర్నబ్‌ తుపాను అతలాకుతలం చేయగా.. తాజాగా బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్‌ తొలి వారంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

24 గంటల్లో మరింత బలపడే అవకాశం

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవుల పరిసరాల్లో ఇది మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నవంబర్‌ 1, 2 తేదీల్లో వర్షాలు

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నవంబర్‌ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, వాయుగుండం దిశ, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంలో మార్పులు ఉండవచ్చు. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ కదలికలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

 రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుపాను ప్రభావం నుంచి కోలుకుంటున్న ప్రాంతాలకు తాజా వాతావరణ పరిణామాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలోని రైతులు వర్ష సూచనలను గమనిస్తూ వ్యవసాయ పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest