ఇంటర్నెట్ మన జీవితాల్లో కీలక భాగంగా మారిపోయిన నేపథ్యంలో, ఇంట్లో Wi-Fi వేగం తక్కువగా ఉండటం అనేది చాలామందికి రోజూ ఎదురయ్యే సమస్య. చదువు, పని, వినోదం ఇలా ఏ రంగాన్ని చూసినా ఇంటర్నెట్ అవసరం తప్పనిసరి. కానీ, రౌటర్‌ను సరైన స్థలంలో ఉంచకపోవడం, పాత మోడల్స్ ఉపయోగించడం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల జోక్యం వంటివి Wi-Fi పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అందుకే కొన్ని సులభమైన మార్గాలు పాటిస్తే ఇంటర్నెట్ స్పీడ్‌ను మెరుగుపరచడం సాధ్యమే.
మొదటిగా, రౌటర్‌ను ఇంటి మధ్య భాగంలో, నేలకంటే కొంచెం ఎత్తుగా ఉంచితే Wi-Fi సిగ్నల్ అన్ని గదులకు సమానంగా పంపవచ్చు. గోడలు, మైక్రోవేవ్‌లు, ఫ్రిడ్జ్, బ్లూటూత్ పరికరాలు వంటి వస్తువుల దగ్గర ఉంచకపోవడం ఉత్తమం. ఇవి సిగ్నల్‌ను బలహీనపరచే ప్రమాదం ఉంది. అలాగే మాన్యువల్‌గా తక్కువ ట్రాఫిక్ ఉన్న Wi-Fi ఛానెల్‌కి మార్చడం ద్వారా ఇతర నెట్‌వర్క్‌ల జోక్యాన్ని తగ్గించవచ్చు.
రెండవది, పాత రౌటర్ ఉంటే Wi-Fi 6 లేదా Wi-Fi 6E మద్దతుతో కొత్త మోడల్ కొనుగోలు చేయడం ఉత్తమం. ఇది వేగాన్ని పెంచడమే కాకుండా భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే, ఇంటర్నెట్ ప్లాన్‌ను కూడా సమీక్షించాలి – మీరు తీసుకున్న ప్లాన్ మీ ఇంట్లో యూజర్ల అవసరాలకు సరిపోతుందా అనే దానిపై ఆలోచించాలి.
మొత్తంగా, Wi-Fi వేగాన్ని మెరుగుపరచేందుకు కొన్ని సాధారణ మార్గాలు – సరిగ్గా రౌటర్ ఉంచడం, ఫర్మ్‌వేర్ అప్‌డేట్లు, మESH Wi-Fi సిస్టమ్ ఉపయోగించడం, అన్‌నెసెసరీ పరికరాలు డిస్కనెక్ట్ చేయడం – అనుసరిస్తే స్పీడ్, కవరేజ్ రెండూ మెరుగవుతాయి. ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా అమలు చేయదగిన మార్గాలే కావడం విశేషం.