Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ!

Tech News Telugu: వాట్సాప్ వాడాలంటే ఇకపై డబ్బులు కట్టాలా? మెటా సంచలన నిర్ణయం..!!

వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్! ఇకపై స్టేటస్ చూడాలంటే ప్రకటనలు భరించాల్సిందే. ఆ ప్రకటనలు వద్దు అనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం..

Published : 2026-01-28 09:45:00

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నిత్యం ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్ తన వినియోగదారులకు చేదు వార్త చెప్పబోతోంది. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందిస్తున్న సేవలను 'మానిటైజ్'  చేసే దిశగా మెటా సంస్థ అడుగులు వేస్తోంది. తాజా బీటా అప్‌డేట్ ప్రకారం, ఇకపై వాట్సాప్‌లో ప్రకటనలు రాబోతున్నాయని, వాటిని నివారించాలంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వాట్సాప్‌లో మనం చేసే చాటింగ్, వీడియో కాల్స్ వంటివి ఎప్పటిలాగే ఉచితంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, 'స్టేటస్'  విభాగంలో మెటా మార్పులు చేయనుంది. యూట్యూబ్ తరహా విధానం మనం ఇతరుల స్టేటస్‌లను చూసే సమయంలో మధ్యలో వీడియో లేదా ఇమేజ్ రూపంలో ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి.

ఒకవేళ మీకు ఈ ప్రకటనలు నచ్చకపోతే  నో-యాడ్స్ సబ్‌స్క్రిప్షన్  కొంత మొత్తాన్ని చెల్లించి ప్రీమియం సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎలాంటి అంతరాయం లేకుండా స్టేటస్‌లను వీక్షించవచ్చు. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ 'ఆండ్రాయిడ్ అథారిటీ' నివేదిక ప్రకారం.. మెటా ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అమలు చేస్తున్న 'పెయిడ్' మోడల్‌ను వాట్సాప్‌కు కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ట్రయల్ వెర్షన్‌లో మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.8 బిలియన్ల వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా భారతదేశంలో 80 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉండటంతో, ఇక్కడ ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపనుంది.

ఏళ్ల తరబడి ఉచితంగా సేవలు అందిస్తున్న వాట్సాప్ నిర్వహణ ఖర్చులు పెరగడం, సర్వర్ల మెయింటెనెన్స్ వంటి కారణాల వల్ల ఆదాయాన్ని పెంచుకోవాలని మెటా భావిస్తోంది. ఇప్పటివరకు కేవలం వాట్సాప్ బిజినెస్ ద్వారా మాత్రమే ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీ, ఇప్పుడు సాధారణ వినియోగదారుల నుంచి కూడా చందా వసూలు చేయాలని యోచనలో ఉంది

Spotlight

Read More →