హైదరాబాద్ కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ నాయుడు ప్రధాన సూత్రధారిగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ప్రతి వారాంతంలో ఏపీ యువతను నగరానికి రప్పించి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
దాడిలో గంజాయి, డ్రగ్స్, కండోమ్స్ స్వాధీనం చేసుకోగా, మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, అశోక్ ఉపయోగించిన ఫార్చునర్ కారుపై లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం సంచలనం రేపింది. ఈ స్టిక్కర్ ఎవరిది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
ఇక కేసులో కీలక నిందితులు శ్రీనివాస్ చౌదరి, అఖిల్ పరారీలో ఉన్నారు. ఎస్‌వీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఈ రేవ్ పార్టీలు జరిగినట్టు గుర్తించారు. విచారణ ఇంకా కొనసాగుతోంది.