సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు, భారత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మరియు పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్‌తో చంద్రబాబు సమావేశమై నూతన విధానాలపై చర్చించారు. కేవలం వినోదం, పర్యాటకం కోసమే కాకుండా ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారుచేసేలా స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తమ స్కూల్ ద్వారా అత్యుత్తమ మైన ప్రమాణాలతో అడ్మిషన్లకు నిబంధనలు రూపొందించామన్నారు. జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడమీలతో భాగస్వామ్యంగా స్కూల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. అంతర్జాతీయంగా ఖతార్ తరహా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు.