వేల కిలోమీటర్ల నడక.. చివరకు అభిమాన క్రికెటర్ ను కలిసిన అభిమాని!
Hardik Pandya Fan Viral Video: అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపించాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. తన అభిమాన క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ఒక్కసారి కలవాలన్న కోరికతో ఏకంగా వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు. లక్నో నుంచి ముంబైకి చేరుకున్నా తన అభిమాన ఆటగాడు అక్కడ లేకపోవడంతో నిరాశ చెందకుండా.. బెంగళూరు వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలా దాదాపు 2,390 కిలోమీటర్లు నడిచి తన కలను నిజం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అభిమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- హార్దిక్ పాండ్యాను కలవాలనే కోరికతో లక్నోకు చెందిన రవి కుమార్ రావత్ 2390 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు.
- హార్దిక్ పాండ్యా, రవి కుమార్ రావత్‌తో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Hardik Pandya Fan Viral news: అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపించాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. తన అభిమాన క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ఒక్కసారి కలవాలన్న కోరికతో ఏకంగా వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు. లక్నో నుంచి ముంబైకి చేరుకున్నా తన అభిమాన ఆటగాడు అక్కడ లేకపోవడంతో నిరాశ చెందకుండా.. బెంగళూరు వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలా దాదాపు 2,390 కిలోమీటర్లు నడిచి తన కలను నిజం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అభిమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లక్నో నుంచి ముంబై వరకు.. కాలినడకన ప్రయాణం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రవి కుమార్ రావత్‌కు భారత క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యా అంటే ఎంతో అభిమానం. తన అభిమాన క్రికెటర్‌ను ఎలాగైనా కలవాలన్న లక్ష్యంతో రవి కాలినడకన ప్రయాణం ప్రారంభించాడు. దాదాపు 1,400 కిలోమీటర్లు నడిచి ముంబైకి చేరుకున్నాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత హార్దిక్ పాండ్యా బెంగళూరుకు వెళ్లినట్లు తెలుసుకున్నాడు.
నిరాశ చెందకుండా బెంగళూరుకు పయనం
ఇంత దూరం ప్రయాణించిన తర్వాత కూడా తన అభిమాన ఆటగాడిని కలవలేకపోవడంతో ఎవరైనా వెనుదిరిగే అవకాశం ఉంది. కానీ రవి మాత్రం తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. మరో 990 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. మొత్తంగా దాదాపు 2,390 కిలోమీటర్లు నడిచి తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకోవాలన్న కోరికను నెరవేర్చుకున్నాడు.
అభిమాని పట్టుదలకు హార్దిక్ ఫిదా
చివరకు రవికి హార్దిక్ పాండ్యాను కలిసే అవకాశం లభించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఘటనలో అభిమానిని ఆకట్టుకున్నది కేవలం హార్దిక్‌తో భేటీ మాత్రమే కాదు.. ఆ తర్వాత క్రికెటర్ చూపించిన ఆదరణ కూడా.
రవి తిరిగి వెళ్లేందుకు హార్దిక్ తన మేనేజర్‌తో టికెట్ ఏర్పాటు చేయించినట్లు కథనాలు వెల్లడించాయి. అంతేకాకుండా, అతడికి ఇంకేమైనా అవసరమా అని కూడా అడిగినట్లు వీడియోలో వినిపిస్తోంది. “కుచ్ చాహియే తో బతా దేనా” (ఏదైనా కావాలంటే చెప్పు) అంటూ హార్దిక్ ఆ యువకుడితో మాట్లాడిన మాటలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
హార్దిక్ పాండ్యాను కలవడానికి అభిమానులు ఇంతటి సాహసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ఒడిశాకు చెందిన మరో యువ క్రికెట్ అభిమాని కూడా తన అభిమాన ఆటగాడిని కలుసుకోవాలనే కోరికతో సైకిల్‌పై బెంగళూరుకు ప్రయాణించినట్లు కథనాలు వెలువడ్డాయి.
తమ అభిమాన ఆటగాళ్లను కలవాలనే కోరిక కోసం అభిమానులు ఎంతటి కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రవి కుమార్ రావత్ ప్రయాణం మాత్రం పట్టుదల ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని అందిస్తోంది.

