⚡ BREAKING
Politics

Bhumana: తిరుచానూరులో భూ ఆక్రమణల ఆరోపణలు.. భూమన కరుణాకర్ రెడ్డిపై విజిలెన్స్ దర్యాప్తు!

Bhumana: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తిరుచానూరు ప్రాంతంలో ప్రభుత్వ, ఇనాం భూములతో పాటు స్వర్ణముఖి నది ప్రవాహ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy

ఇనాం భూములపై కన్నా? రూ.45 కోట్ల భూమి వ్యవహారంలో భూమన పేరు..

విజిలెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు.. తిరుచానూరు భూ వివాదం తెరపైకి..

తిరుపతి: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తిరుచానూరు ప్రాంతంలో ప్రభుత్వ, ఇనాం భూములతో పాటు స్వర్ణముఖి నది ప్రవాహ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

విజిలెన్స్ విచారణలో భాగంగా తిరుచానూరు పరిధిలోని సర్వే నంబర్లు 473, 474లో భూములపై పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూమన కుటుంబ సభ్యుల పేర్లతో సుమారు 15.36 ఎకరాల భూమి ఉన్నట్లు, అదే సర్వే నంబర్ల పరిధిలో మొత్తం 24.36 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

సర్వే నెంబర్ 474/1ఎలో ఉన్న సుమారు 9 ఎకరాల ఇనాం భూమిని ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి విలువ సుమారు రూ.45 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అలాగే స్వర్ణముఖి నది ప్రవాహ ప్రాంతాన్ని మట్టితో నింపి, కొంత భాగాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని ఉపయోగించుకుని భూములపై యథేచ్ఛగా జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పక్క భూముల యజమానులను రోడ్డు కోసం ఒత్తిడికి గురిచేయడం, ప్లాట్లు, ఆస్తుల విషయంలో వివాదాలకు కారణమయ్యారనే ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇదే క్రమంలో సర్వే నెంబర్ 478లోకి ప్రవేశించి ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై భూ యజమాని ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది.

భూ ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, నదీ ప్రవాహ ప్రాంతాల పరిరక్షణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగుతోంది.

Be the first to react

More Coverage