Palla Srinivasa: మా హయాంలోనే శంకుస్థాపన.. మా హయాంలోనే ప్రారంభం.. పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు!

Palla Srinivasa: ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభం కానుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు!
పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు!
  • ఈ ఎయిర్‌పోర్టు కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్..

  • politics: ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం మణిహారం లాంటిదన్న పల్లా...

Palla Srinivasa: ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక స్వరూపాన్ని మార్చేసే ప్రతిష్టాత్మక భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ త్వరలోనే జాతికి అంకితం కానుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు వైభవంగా ప్రారంభం కానుందని తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఈ విమానాశ్రయం ఒక మణిహారంలా నిలుస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో బహుళజాతి సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు రావడానికి మార్గం సుగమమవుతుందని హర్షం వ్యక్తం చేశారు.

గతంలో అడ్డుకున్నవారే ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు!
విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన వారే, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయ్యేసరికి క్రెడిట్ చోరీకి పాల్పడటం తీవ్ర విచారకరమని విమర్శించారు.

గతంలో "ఎర్ర బస్సు కూడా సరిగ్గా రాని చోట అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు?" అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో ప్రాజెక్టును హేళన చేసిన జగన్, ఇప్పుడు తానే నిర్మించినట్లు భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎంత బడ్జెట్ కేటాయించారో, పనులను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు విజన్‌కు నిదర్శనం.. కూటమి వేగవంతమైన చర్యలు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, పట్టుదలకు భోగాపురం ఎయిర్‌పోర్టు అత్యుత్తమ నిదర్శనమని పల్లా కొనియాడారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని, ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిపోయిన భూసేకరణ, రన్‌వే, టెర్మినల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి రికార్డు సమయంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిందని తెలిపారు. తమ హయాంలోనే శంకుస్థాపన జరిగి, తమ పాలనలోనే ప్రారంభోత్సవం జరుగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిజం, ఐటీ, ఫార్మా రంగాలు ఊపందుకుంటాయని, స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest