Income Tax: ఐటీఆర్‌ ఫైలింగ్‌ అలర్ట్: గడువు ముగిస్తే రూ. 5,000 పెనాల్టీ.. నేడే మీ రిటర్న్ దాఖలు చేయండి!

Income Tax: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను జులై 31లోగా తమ రిటర్నులను సమర్పించాల్సి ఉంది. ఈ గడువు ముగియడానికి మరో ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది.

ఐటీఆర్‌ ఫైలింగ్‌ అలర్ట్: గడువు ముగిస్తే రూ. 5,000 పెనాల్టీ.. నేడే మీ రిటర్న్ దాఖలు చేయండి!
ఐటీఆర్‌ ఫైలింగ్‌ అలర్ట్: గడువు ముగిస్తే రూ. 5,000 పెనాల్టీ.. నేడే మీ రిటర్న్ దాఖలు చేయండి!
  • ఫైల్ చేశాక 60 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి..

  • Business: డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా ఫైల్ చేసే అవకాశం..

Income Tax: 2026–27 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY 2026-27) గాను వ్యక్తిగత, ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) దాఖలు చేయడానికి నిర్దేశించిన గడువు ముగియడానికి మరో ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. జులై 31వ తేదీని పన్ను శాఖ చివరి తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారులు తక్షణమే తమ రిటర్నులను సమర్పించాలని ఆర్థిక, పన్ను రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో విఫలమైతే చట్టపరంగా జరిమానాలు మరియు వడ్డీ భారం మోయాల్సి వస్తుంది.

గడువు తప్పితే పడే జరిమానాలు, ఆలస్య రుసుములు ఇవే!
జులై 31 నాటికి ఈ-ఫైలింగ్ ప్రక్రియ పూర్తి చేయని వారు, డిసెంబర్ 31, 2026 వరకు ఆలస్య రుసుము (Late Fine) చెల్లించి ‘బిలేటెడ్ రిటర్న్’ (Belated Return) సమర్పించే వెసులుబాటు ఆదాయపు పన్ను శాఖ కల్పించింది.

రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి: వార్షిక సంపాదన రూ. 5 లక్షలలోపు ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ. 1,000 ఆలస్య రుసుము వర్తిస్తుంది.

రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి: వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి ఏకంగా రూ. 5,000 వరకు లేట్ ఫీజు పడుతుంది.

ప్రాథమిక మినహాయింపు లబ్ధిదారులకు: బేసిక్ టాక్స్ మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ లేట్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ఏవైనా పన్ను బకాయిలు (Tax Dues) ఉన్నట్లయితే, వాటిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

జులై 29 నాటికి 5 కోట్లకు పైగా ఫైలింగ్స్: ఐటీ శాఖ గణాంకాలు..
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జులై 29 నాటికి దేశవ్యాప్తంగా 5.02 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

ఇందులో ఇప్పటికే 4.69 కోట్ల రిటర్నులు ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుకోగా, 2.33 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ కూడా చేసింది. గడువు దగ్గర పడుతుండటంతో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో దాదాపు 30 లక్షల రిటర్నులు సమర్పించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

ఐటీఆర్ ఆలస్యమైతే జరిగే నష్టాలు.. ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి!
నిర్ణీత గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల కేవలం జరిమానా మాత్రమే కాకుండా పలు రకాల ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నష్టాల క్యారీ ఫార్వర్డ్ నిలిపివేత: షేర్ మార్కెట్, బిజినెస్ లేదా క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన నష్టాలను (Losses) తర్వాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే హక్కును పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు.

రిఫండ్లలో తీవ్ర జాప్యం: పన్ను రిఫండ్ రావలసిన వారికి గడువు దాటితే ప్రాసెసింగ్ ఆలస్యమై, రిఫండ్ సొమ్ము చేతికి అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది.

60 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ ఐటీఆర్: ఫైల్ చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఆధార్ ఓటీపీ (Aadhaar OTP), నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ (DSC) ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో మీరు సమర్పించిన ఐటీఆర్ చెల్లనిదిగా (Invalid Return) పరిగణించబడుతుంది.

Tags

Be the first to react

Latest