Lok Sabha: దేశభక్తికి, జాతీయ సమైక్యతకు మరింత బలం: లోక్‌సభలో వందేమాతరం బిల్లుకు ఆమోదముద్ర! జాతీయ గేయాన్ని అవమానిస్తే..

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం ముద్ర వేసింది. జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

జాతీయ గేయాన్ని అవమానిస్తే
జాతీయ గేయాన్ని అవమానిస్తే
  • వందేమాతరం అవమానాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

  • National: అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధించేలా కఠిన నిబంధనలు..

Lok Sabha: దేశ స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయాన్ని అవమానించడం లేదా దాని ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించే ‘జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు–2026’ (The Prevention of Insults to National Honour Amendment Bill, 2026) పార్లమెంట్ ఆమోదం పొందింది. బుధవారం రాజ్యసభ ఆమోద ముద్ర వేయగా, గురువారం లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్య మూజువాణి ఓటుతో (Voice Vote) ఈ బిల్లు నెగ్గింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వెంటనే ఇది చట్టంగా అమలులోకి రానుంది.

1971 చట్టానికి కీలక సవరణలు: ఇకపై మూడేళ్ల జైలు శిక్ష! 

1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం (Prevention of Insults to National Honour Act, 1971)లోని సెక్షన్ 3ని సవరిస్తూ ఈ నూతన చట్టాన్ని రూపొందించారు. ఇప్పటివరకు కేవలం జాతీయ జెండా, భారత రాజ్యాంగం మరియు జాతీయ గీతం ‘జనగణమన’కు మాత్రమే ఉన్న చట్టపరమైన రక్షణలు, కఠిన శిక్షాస్మృతులు ఇకపై ‘వందేమాతరం’ గేయానికి కూడా పూర్తిస్థాయిలో వర్తిస్తాయి. నేరం మరియు శిక్షలు: ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానాన్ని అడ్డుకున్నా, ఆలాపనకు భంగం కలిగించినా లేదా గేయాన్ని అవమానించినా గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే నిబంధనలను చేర్చారు.

పునరావృత నేరాలకు: రెండవసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు ఈ నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం తగ్గకుండా నిర్బంధ జైలు శిక్ష అమలవుతుంది. సంస్కృతి, దేశభక్తికి సమున్నత గౌరవం: కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. వందేమాతరం అనేది కేవలం ఒక గేయం మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మ, కోట్లాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ నిరతికి ప్రతీక అని పేర్కొన్నారు.

జాతీయ గీతం 'జనగణమన'తో సమానంగా వందేమాతరానికి అత్యున్నత చట్టబద్ధ స్థానాన్ని, గౌరవాన్ని కల్పించడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని వివరించారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్న విశిష్ట సందర్భంలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని సభలో వెల్లడించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఇతర వివాదాస్పద అంశాలపై పట్టుబడుతూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తోసిపుచ్చింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా వందేమాతరానికి దక్కాల్సిన చట్టపరమైన రక్షణను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చిందని అధికార పక్ష ఎంపీలు స్పష్టం చేశారు.  

Tags

Be the first to react

Latest