LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!

Chandrababu: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర సహాయ నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!

అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశాలు.. రాష్ట్ర అంశాలపై చర్చ..

నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు..

దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర సహాయ నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు.

ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా, భద్రతా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంను కలవనుండగా, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరిగే సీఐఐ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది.

సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని ఆర్థిక సలహాదారు ఎస్ మహేంద్రదేవ్ తో సీఎం భేటీ కానున్నారు. అలాగే నీతి ఆయోగ్ సభ్యులు కేవీ రాజు, బాలసుబ్రమణ్యం లతో కూడా సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రోజు చివరగా సాయంత్రం 6.30 గంటలకు రోడ్లు, రహదారుల శాఖ కార్యదర్శి ఉమాన్కర్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…