⚡ BREAKING

Praja vedhika: హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయని రెవెన్యూ యంత్రాంగం.. కక్షపూరితంగా 22-Aలోకి భూమి! వైసీపీ నేతల బరితెగింపు..

Praja vedhika: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కపురం గ్రామానికి సంపంగి వెంకటరమణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో గ్రీవెన్స్ మేనేజర్ కి అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. సర్వే నంబర్లు 424 (1.41 ఎకరాలు), 431-2 (2.00 ఎకరాలు), 432 (1.50 ఎకరాలు) లలో తనకు సొంత వ్యవసాయ భూమి ఉంది.

కక్షపూరితంగా 22-Aలోకి భూమి! వైసీపీ నేతల బరితెగింపు..
కక్షపూరితంగా 22-Aలోకి భూమి! వైసీపీ నేతల బరితెగింపు..
  • హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయని రెవెన్యూ యంత్రాంగం.. కక్షపూరితంగా 22-Aలోకి భూమి..

  • Politics: కార్యాలయానికి వచ్చిన వారి దగ్గర అర్జీలు స్వీకరించిన గ్రీవెన్స్ మేనేజర్...

Praja vedhika: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కపురం గ్రామానికి సంపంగి వెంకటరమణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో గ్రీవెన్స్ మేనేజర్ కి అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. సర్వే నంబర్లు 424 (1.41 ఎకరాలు), 431-2 (2.00 ఎకరాలు), 432 (1.50 ఎకరాలు) లలో తనకు సొంత వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీపీ కుటుంబ సభ్యులైన పూజారి పెద్ద నాగయ్య, చిన్ననాగయ్య, ఉపేంద్ర అను వ్యక్తులు సదరు భూమిలోకి వెళ్లే దారిని దౌర్జన్యంగా రాళ్లతో అడ్డుపెట్టి బంద్ చేశారు. దీనివల్ల పొలానికి వెళ్లలేక, సకాలంలో పంటలు వేసుకోలేక, కోతలు కోయలేక తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నాం. ఈ సమస్యపై ఎమ్.ఆర్.ఓ గారికి ఫిర్యాదు చేయగా, వారు స్వయంగా దారిని పరిశీలించి, రాస్తాను విడిపించాలని ముల్లనూరు ఎస్.ఐ గారికి సూచించారు. అయినప్పటికీ ఎస్.ఐ గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, మళ్లీ ఎమ్.ఆర్.ఓ వద్దకే పొమ్మంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. 

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన దాసరి అంజయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే రోడ్డును, కల్వర్టును గ్రామ ప్రజలందరూ ఉపయోగిస్తున్నారు. సదరు రోడ్డుకు అడ్డంగా గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పొక్లైన్ తో పెద్ద గుంతలు తీసి, రాళ్లు పాతేసి రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే పాఠశాల పిల్లలు, కాలనీ వాసులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరకు పోలీసులు వచ్చినా కూడా వారిని సైతం లక్ష్యపెట్టకుండా అడ్డుకుంటూ, గ్రామంలో అందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, అజయ్ కుమార్, రవి కుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. Flying Borders Consultancy & Immigration సంస్థ ఐర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, ఫిన్లాండ్ వంటి యూరప్ దేశాల్లో చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా ప్రకటనల ద్వారా తమను నమ్మించారు. విజయవాడ, హైదరాబాద్‌లలో ఉన్న తమ కార్యాలయాలకు పిలిపించి, విదేశాల్లో ఉద్యోగం రాగానే మిగిలిన డబ్బులు జీతం నుంచే EMI రూపంలో కట్టుకోవచ్చని నమ్మబలికారు. తమ కుటుంబ పొదుపు మొత్తాలను, బంగారం తాకట్టు పెట్టి, భూములు అమ్మి, అప్పులు చేసి ప్రతి ఒక్కరూ రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు సదరు కన్సల్టెన్సీకి చెల్లించాం. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన 200 మందికి పైగా వారి నుండి దాదాపు కోట్ల రూపాయలు ఈ సంస్థ వసూలు చేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత "ఈసారి సెలెక్ట్ కాలేదు, మరో దేశానికి పంపిస్తాం" అంటూ నెలల తరబడి నాన్చారు. సందేహం వచ్చి విజయవాడ ఆఫీస్‌కు వెళ్లగా తాళాలు వేసి ఉండటం, గోడలపై "FRAUD" అని రాసి ఉండటంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం గ్రామానికి చెందిన శీలబోయిన నాగమణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..మంగపతిదేవిపేట గ్రామంలో తమకు 3 ఎకరాల 65 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో 1 ఎకరం భూమిని మలెల్లి శ్రీరాములు అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడు. 2022 నుండి రీ-సర్వే చేసి పొలం ఇప్పిస్తామని నమ్మబలికి ఎమ్.ఆర్.ఓ, వి.ఆర్.ఓ, సర్వేయర్లు తమ వద్ద అనేకసార్లు డబ్బులు తీసుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో స్పందనలో అర్జీలు ఇచ్చినా, ఆర్డీవో ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా "మీ భూమి మీకొచ్చాలా చేయము" అని అధికారులు బెదిరింపులకు దిగారు. అధికారుల వేధింపులతో విసిగిపోయి తాను హైకోర్టును ఆశ్రయించగా, నోటీసులు వచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. "హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? మీ భూమి వేరేవాళ్లకు రాసేస్తాం, మీరు మా చిన్న వెంట్రుక కూడా పీకలేరు" అని ఎమ్.ఆర్.ఓ, వి.ఆర్.ఓ, సర్వేయర్లు అత్యంత దుర్భాషలాడుతూ బెదిరించారు. హైకోర్టు, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో గార్లు ఆదేశించినా పట్టించుకోని అధికారులు.. కక్షపూరితంగా 1B, అడంగల్ రాకుండా ఈ భూమిని Section 22-A(1a) లోకి మార్చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

గుంటూరుకు చెందిన మాడుగుల మణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తాడికొండ మండలం, లాం గ్రామంలోని సర్వే నంబర్ 348లో తన తండ్రి లేట్ పుల్లా నాగభూషణం పేరిట 1 ఎకరం 16.5 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి ఆయన పేరిట పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. తండ్రి నాగభూషణం, తల్లి సత్యవేదం మరణించిన తర్వాత, ప్రక్క పొలం కొనుగోలు చేసిన కొమ్మినేని ప్రసాదరావు అనే వ్యక్తి తమ భూమిలోని 16.5 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారు. తమ కుటుంబానికి సంబంధించిన ఆర్‌ఎస్‌ఆర్, 1B,అడంగల్, ఈసీ (EC) వంటి అన్ని ప్రభుత్వ రికార్డులలో 1 ఎకరం 16.5 సెంట్లు ఉన్నట్లు స్పష్టంగా ఉంది. క్రమం తప్పకుండా భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నాం. అయితే 2019 సంవత్సరం నుండి ఆన్‌లైన్ రికార్డుల్లో మాత్రం కేవలం 1 ఎకరం మాత్రమే చూపిస్తోంది. ప్రక్క పొలం వారు కూడా తమకు 1 ఎకరం 16.5 సెంట్ల భూమి ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చారని, వి.ఆర్.ఓ కూడా భూమి ఉన్నట్లు ధృవీకరించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఎమ్.ఆర్.ఓ గారు మాత్రం 1 ఎకరం మాత్రమే ఉందంటూ కాలయాపన చేస్తున్నారని, అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందిన శగినాల వెంకటేశ్, శగినాల వినోద్ కుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కొటాల గ్రామం, ఎలపువారికోటకు చెందిన శగినాల గీతారాణి (ఇంటి కోడలు)కి ఎటువంటి హక్కు లేకపోయినప్పటికీ, తన భర్త, మామ (లేట్ సుబ్బరాయుడు) బ్రతికి ఉండగానే వారిని మోసం చేసి పిత్రార్జిత వ్యవసాయ భూమిని తన పేరిట 1B ఆన్‌లైన్ చేసుకుంది. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి ఖాతా నంబర్ 1557 తో గీతారాణి పేరిట పాస్ పుస్తకం జారీ అయి ఉంది. మోసపూరితంగా పొందిన ఈ ఆన్‌లైన్ పాస్ పుస్తకాన్ని రద్దు చేయాలని గత ప్రభుత్వంలో తంబళ్లపల్లె తహశీల్దార్ గారికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి సింగమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..రాజుపాలెం గ్రామంలోని సర్వేనెంబర్ 44/3 లో తమ భర్త లేట్ వెంకటేశ్వర్లు గారి పేరిట 1 ఎకరం 43 సెంట్ల భూమి ఉంది. 1998వ సంవత్సరంలో 'ఓగేరు వాగు' కరకట్టల నిర్మాణం కోసం ఈ భూమి నుండి 0.62 సెంట్ల భూమిని ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూమి ఇప్పటికీ తమ సాగులోనే ఉంది. 2021 నవంబర్ 24న భర్త వెంకటేశ్వర్లు మరణించారు. గత ప్రభుత్వం (2023) నుండి "రీ-సర్వేలో భూమి రికార్డుల్లో లేదు" అనే నెపంతో తమకి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయలేదు. ఆధారాలు చూపించినా అధికారులు పట్టించుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన మొత్తంగుల వెంకటరాముడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సానేవారిపల్లి గ్రామ పొలంలో తమ పెద్దలు రాళ్లు, రప్పలు తొలగించి చదును చేసుకున్న భూమికి సంబంధించి 1979లో తహశీల్దార్ ద్వారా D-పట్టాలు మంజూరయ్యాయి. సర్వే నంబర్ 9-3 లో 5 ఎకరాల 58 సెంట్లు తన పేరిట పట్టా వచ్చింది. సర్వే నంబర్ 9-2 లో 5 ఎకరాల 50 సెంట్లు భూమికి తమ్ముడు నారాయణస్వామి అప్పట్లో మైనర్ కావడంతో తండ్రి వెంకటప్ప గార్డియన్‌గా పట్టా ఇచ్చారు. నారాయణస్వామి మేజర్ అయిన తర్వాత ఆ పట్టాను అతని పేరిట మార్చారు. తన పేరిట ఉన్న 5 ఎకరాల 50 సెంట్ల పొలం కాకుండా, తనకి సరిహద్దుగా ఉన్న పొలంలో కూడా సగం భాగం ఇవ్వాలని తమ్ముడు గత 12 సంవత్సరాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ సమస్యపై ముదిగుబ్బ తహశీల్దార్, ధర్మవరం ఆర్డీవో, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పలుమార్లు అర్జీలు ఇచ్చి భూమికి కొలతలువేయాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన గుర్రం నారాయణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బండక్రిందపల్లి రెవెన్యూ గ్రామంలోని లేట్ వడ్డి నాగయ్య వారసులు (వడ్డి భాస్కర్, వడ్డి రవి) - సర్వే నెం. 465/6 లో 4 ఎకరాల 30 సెంట్లు, లేట్ మద్దెల సుబ్బయ్య వారసులు (శ్యామల, యల్లమ్మ, శారద) - సర్వే నెం. 465/6 లో 3 ఎకరాల 25 సెంట్లు, లేట్ కాకర్ల వెంకటేష్ వారసురాలు (కాకర్ల వారాది) - సర్వే నెం. 464/2 లో 0 ఎకరాల 37 సెంట్లు మొత్తం 7 ఎకరాల 92 సెంట్లు భూమి తమ తండ్రుల నుంచి సంక్రమించిన పిత్రార్జిత జీవనాధారం. ఈ 7.92 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన డి. తిమ్మారెడ్డి, ఆయన భార్య బి. లక్ష్మిదేవమ్మ, కుమారులు డి. కోదండరామిరెడ్డి (డి.కె. రెడ్డి), డి. వెంకట్రామిరెడ్డి, సునీత అనే వ్యక్తులు అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకుని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారు. తమ భూమిని తమకు ఇవ్వాలని ప్రశ్నించగా, ఆక్రమణదారులు తమపై దురుసుగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..జి. వేమవరం గ్రామంలో మత్స్యకారుల జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వం గతంలో 10 మందికి ఒక్కొక్కరికి 1 ఎకరం చొప్పున డి-ఫారం పట్టాలు మంజూరు చేసింది. (సర్వే నంబర్లు 347/1 నుండి 347/10 వరకు). సదరు 10 ఎకరాల భూమిని ప్రక్కనే ఉన్న భూస్వామి సత్యనారాయణ, ఆయన అనుచరులు ఆక్రమించుకుని తమను భూమిలోకి రాకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, స్థానిక నాయకుల మద్దతు ఆక్రమణదారులకే ఉండటంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, పలుమార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం వెలగచర్ల గ్రామానికి చెందిన సుబ్బిగారి మణెమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన భర్త (లేట్ వెంకటరాము) 2012లో మరణించారు. భర్త అన్నదమ్ములు ఉమ్మడిగా ఉన్న ఇల్లును వేరొకరికి అమ్మడంతో గత 15 సంవత్సరాలుగా వివాదం నెలకొంది. ఆ ఇల్లు కొనుగోలు చేసిన శివయ్య అనే వ్యక్తి, ఆయన భార్య కలసి ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ, అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారు. శివయ్య తన భార్యను ముందు ఉంచి గొడవకు పంపి, తమను నడివీధిలోకి లాగి కొట్టడమే కాకుండా ఇతర మగవారిని పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇల్లు వదిలి వెళ్లకపోతే నిన్ను, నీ పిల్లలను చంపేస్తామని బెదిరిస్తున్నారని, దాడులను అడ్డుకోవడానికి వచ్చిన గ్రామస్తులపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన పొట్టిపోగు రాకేష్ కుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రంగసముద్రం పంచాయతీ ఎస్.టి. కాలనీ దగ్గర హరిజనవాడలోని సర్వే నంబర్లు 1076 (1.00 ఎకరా), 1081 (1.00 ఎకరా), 1094 (0.50 సెంట్లు) లలో మొత్తం 2.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని తమ తాతగారైన పి. ఇసాక్, ఆయన సోదరులు పి. క్రిష్టఫర్, పి. దేవసహాయంలు గతంలో చర్మకార సొసైటీకి డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిలో కొంత భాగం తమ స్వాధీనంలోనే ఉంది. తెలియకుండానే రెవెన్యూ అధికారులు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో కుమ్మక్కై, రికార్డుల్లో తప్పుగా ఎంట్రీలు చేశారు. దళిత కులానికి చెందిన భూమి ఓసీ కులం వారికి వంశపారంపర్యంగా ఎలా సంక్రమిస్తుందో విచారించాలని ప్రశ్నించాం. అయినా ఎలాంటి సమాధానం చెప్పకుండా..తమకు అన్యాయం చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలపి కోరాడు.

కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం పెదచందాల గ్రామానికి చెందిన బస్వాని వీర్లంకమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ 1976 జూలై 7న తండ్రి నడకుదిటి నరసింహస్వామి ద్వారా 0.35 సెంట్ల భూమి (ఆర్.ఎస్.నెం. 31/16) పసుపు కుంకుమ కింద సంక్రమించింది. బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ (డాక్యుమెంట్ నెం. 1291/1976) అయిన ఈ భూమికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డుల్లోనూ తన పేరే నమోదు అయి ఉంది. తన భర్త బస్వాని బలరాముడు ఇటీవల (09-07-2026న) మరణించారు. కుటుంబ సభ్యులందరూ దుఃఖంలో ఉండి బయటకు రాలేని పరిస్థితిని ఆసరాగా తీసుకుని, గ్రామానికి చెందిన బస్వాని పూర్ణచంద్రరావు, ఆయన కుమారుడు కృష్ణమూర్తి అక్రమంగా స్థలంలోకి చొరబడి రేకుల షెడ్ నిర్మాణం ప్రారంభించారు. ఆక్రమణను నిలదీస్తే ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టి లాయర్ల ద్వారా హత్యాయత్నం కేసులు పెట్టిస్తామని, అవసరమైతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Tags

Be the first to react

Latest