⚡ BREAKING

Rao Bahadur: ఓటీటీలోకి వస్తున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!

Rao Bahadur: టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ కుమార్ డి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ సోషల్ డ్రామా 'రావు బహదూర్' డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోకి వస్తున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!
ఓటీటీలోకి వస్తున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!
  • థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకున్న చిత్రం..

  • ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న సత్యదేవ్ చిత్రం..

Rao Bahadur: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ సోషల్ డ్రామా ‘రావు బహదూర్’ (Rao Bahadur) డిజిటల్ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. ప్రశాంత్ కుమార్ డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో సృష్టించిన ఇంపాక్ట్ తర్వాత, డిజిటల్ వేదికపై ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసింది. జులై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్' (GMB Entertainments) సమర్పణలో తెరకేక్కడం ఈ చిత్రానికి మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అద్భుతమైన నిర్మాణ విలువలు, ఆకట్టుకునే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమా వైవిధ్యమైన పీరియాడికల్ కథాంశం, నేటివిటీ ప్రతిబింబించే సంభాషణలు, సత్యదేవ్ పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ మరియు సాంకేతిక ప్రమాణాలతో విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను కైవసం చేసుకుంది. కథను దర్శకుడు మలిచిన విధానం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ విడుదలవుతుండటంతో, ఈ సినిమా మరింత విస్తృతమైన ఓటీటీ ప్రేక్షకులకు చేరువ కానుంది.

Tags

Be the first to react

Latest