LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: అమరావతిలో సింగపూర్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌! మంత్రి లోకేష్ కీలక ప్రకటన!

Nara Lokesh: సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Nara Lokesh: అమరావతిలో సింగపూర్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌! మంత్రి లోకేష్ కీలక ప్రకటన!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..

భారతదేశంలోనే మోడల్ టౌన్ షిప్ గా నిర్మాణం చేపడతాం..

సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శ టౌన్‌షిప్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

సింగపూర్‌లో నిర్వహించిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకోవాలని, ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ RFP నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. అమరావతికి ఇప్పుడు జాతీయ స్థాయిలో చట్టబద్ధత లభించిందని, దీంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ తరహాలో గ్లోబల్ MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం సింగపూర్‌లోని ప్రసిద్ధ సన్‌టెక్ సిటీ నమూనాను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్య అవకాశాలను విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బలమైన భాగస్వామ్యం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల అమలుపై ప్రతి నెలా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన SAGE కార్యక్రమంలో ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు పాల్గొని పరిపాలనపై శిక్షణ పొందారని చెప్పారు. అలాగే 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారని, అక్కడ నేర్చుకున్న అంశాలను రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేస్తామని పేర్కొన్నారు.

గత నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ, జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అంశాల పురోగతిని సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణపై సింగపూర్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గాన్ సియో హువాంగ్ తో పాటు పలువురు సింగపూర్ ప్రభుత్వ అధికారులు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులె, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…