⚡ BREAKING

TANA: పైన్విల్ చర్చికి ఆహార విరాళం అందించిన తానా ఛార్లెట్ బృందం.. 75 నిత్యావసర సరుకుల బ్యాగులు, 400 ఫుడ్ కాన్స్ పంపిణీ!

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం మరోసారి తన సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంది. తెలుగు సమాజానికే కాకుండా అమెరికాలోని స్థానిక కమ్యూనిటీకి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో ఛార్లెట్లోని పైన్విల్ ప్రాంతంలోని ఒక చర్చికి ఆహార విరాళాన్ని అందించింది.

TANA Donation
TANA Donation

75 నిత్యావసర సరుకుల బ్యాగులు, 400 ఫుడ్ కాన్స్ విరాళంగా అందించిన తానా..

ఆకలి తీర్చే దిశగా తానా ఛార్లెట్ విభాగం మరో సేవా కార్యక్రమం..

ఛార్లెట్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం మరోసారి తన సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంది. తెలుగు సమాజానికే కాకుండా అమెరికాలోని స్థానిక కమ్యూనిటీకి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో ఛార్లెట్లోని పైన్విల్ ప్రాంతంలోని ఒక చర్చికి ఆహార విరాళాన్ని అందించింది.

ఈ సేవా కార్యక్రమంలో భాగంగా తానా నాయకులు, సభ్యులు కలిసి 75 బ్యాగుల నిత్యావసర సరుకులు మరియు 400 ఫుడ్ కాన్స్ సేకరించి చర్చి నిర్వాహకులకు అందజేశారు. ఈ విరాళం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఆహార సహాయం అందించనున్నట్లు చర్చి ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు తానా ఛార్లెట్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా అందించిన ఈ ఉదారమైన సహాయం ఎంతోమంది అవసరమైన వారికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస లావుతో పాటు పలువురు నాయకులు ఛార్లెట్ బృందాన్ని అభినందించారు. సమాజానికి సేవ చేయడంలో ఛార్లెట్ విభాగం చూపుతున్న చొరవ ప్రశంసనీయమని వారు అన్నారు.

ఛార్లెట్ తానా నాయకులు మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమానికి తమవంతు సహకారం అందించిన ప్రతి దాతకు, వాలంటీర్కు, శ్రేయోభిలాషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ సమాజానికి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రవి (నాని) వడ్లముడి, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.

Tags

Be the first to react

Latest