అమరావతి ORR పై కీలక మార్పు – కొత్త రూట్‌లో నిర్మాణం, టెండర్లతో బిగ్ అప్‌డేట్!

Amaravati OTT: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి NHAI సుమారు రూ. 15,116 కోట్ల అంచనా వ్యయంతో తాజా టెండర్లను ఆహ్వానించింది. గతంలో నాలుగు ప్యాకేజీలుగా ఉన్న ఈ ప్రాజెక్టును PPAC సూచనల మేరకు రెండు ప్యాకేజీలకు కుదించగా, 189.93 కి.మీ. ప్రధాన ఓఆర్ఆర్ మరియు 5.2 కి.మీ. నారాకోడూరు–బుడంపాడు గుంటూరు కనెక్ట్ రోడ్డుతో కలిపి మొత్తం 195.13 కి.మీ. మేర నిర్మించేందుకు జనవరి 15 వరకు బిడ్లు స్వీకరించనున్నారు.

media 779f7b81bd2af8f04ac00564
media 779f7b81bd2af8f04ac00564
  • రాజధాని ఔటర్ రింగ్ రోడ్డులో మార్పులు – ఏయే ప్రాంతాల మీదుగా వెళ్తుందంటే?

  • అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి మరో అడుగు – మారిన ప్యాకేజీలు, తాజా టెండర్ల వివరాలు!

  • అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై అప్‌డేట్ – ఈ ప్రాంతాలకు మహర్దశ!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పనులను వేగవంతం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా మరోసారి టెండర్లను ఆహ్వానించింది. గతంలో నాలుగు ప్యాకేజీలుగా నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు రెండు ప్యాకేజీలుగా మార్చింది. మొత్తం రూ.15,116.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 195.13 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసలుగా నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన రహదారి 189.93 కిలోమీటర్లు కాగా, గుంటూరు నగరాన్ని అనుసంధానించేందుకు నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు మరో 5.2 కిలోమీటర్ల కనెక్టింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ రహదారి పూర్తయితే అమరావతి చుట్టూ ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి.

రెండు ప్యాకేజీలుగా నిర్మాణం

తాజా టెండర్ల ప్రకారం మొదటి ప్యాకేజీ 87.63 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపం నుంచి ఆగిరిపల్లి, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. ఈ ప్యాకేజీకి సుమారు రూ.7,873.40 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

రెండో ప్యాకేజీ 107.50 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఉయ్యూరు నుంచి గుంటూరు మీదుగా తిరిగి కంచికచర్ల వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సుమారు రూ.7,243.05 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కృష్ణా నదిపై నిర్మించనున్న రెండు కీలక వంతెనలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నాయి.

ఐదు జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యం

ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా సాగనుంది. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. టోల్ ఆదాయం ఆధారంగా ప్రాజెక్టు నిర్వహణ, పెట్టుబడుల రికవరీకి సంబంధించిన నిబంధనలను టెండర్లలో పొందుపరిచారు. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (BOT) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక రూపొందించింది.

తాజా టెండర్ల ప్రకారం 2027 జనవరి 15 వరకు కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించవచ్చు. జనవరి 18న బిడ్లను తెరవాలని నిర్ణయించారు. గతంలో నాలుగు ప్యాకేజీలుగా ఉన్న నిర్మాణ ప్రణాళికను పబ్లిక్ ప్రైవేట్ అప్రైజల్ కమిటీ (PPAC) సూచనల మేరకు రెండు ప్యాకేజీలుగా మార్చారు.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు సరకు రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు ఇతర ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో పెరగనున్న జనాభా, పారిశ్రామిక అవసరాలు, రవాణా డిమాండ్‌కు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.

Tags

Be the first to react

Latest