ఒక రాత్రిలో లక్షాధికారిగా మారాలంటే.. ఈ వాగు దగ్గరకు రండి! ఇదే అసలైన వజ్రాల వేట - ఎక్కడంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇప్పుడు మరో కీలక అడుగు వేశాయి. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనడానికి జాయింట్ వెంచర్లకు (Joint Ventures - JV) అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

GST: కార్ కొనేవారికి గుడ్ న్యూస్..! కొత్త జీయస్టీ విధానం.. వాటిపై భారీ డిస్కౌంట్..!

గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకోవచ్చు. ఈ నిర్ణయం, ప్రీ-బిడ్ మీటింగ్‌కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

World Class state Library: ఏపీలో కొత్తగా వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ! రూ.150 కోట్లతో అక్కడే ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

సాధారణంగా పెద్ద ప్రాజెక్టులను చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల నిర్మాణం ఆలస్యమై, వ్యయం భారీగా పెరుగుతుంది. ఇతర మెట్రో ప్రాజెక్టులను అధ్యయనం చేసిన తర్వాత, పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణా రెడ్డి తెలిపారు. రెండు ప్రాజెక్టులు కూడా రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి, నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

India Pakistan: ఆసియా కప్ ఫైనల్లో మూడోసారి భారత్-పాక్ తలపడే అవకాశం.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ తర్వాత గన్ ఫైరింగ్!

విశాఖ మెట్రో: మొదటి దశలో 46.23 కిలోమీటర్ల సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచారు.
విజయవాడ మెట్రో: మొదటి దశలో 38 కిలోమీటర్ల సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచారు.

Washington: మూడు నాలుగు రోజుల్లోనే భారతీయ కుటుంబాలు అల్లకల్లోలం! ట్రంప్ నిర్ణయం.. విద్యార్థుల్లో నిరాశ!

ఈ టెండర్లకు గడువును కూడా పొడిగించారు. విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ 10 వరకు, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14 వరకు గడువు ఉంది.

Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! దీపావళి నాటికి 10 గ్రా ₹ 1.25 లక్షలకు! నిపుణుల సూచనలు!

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, విశాఖ మెట్రో రైలుకు వంద శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర పెద్దలు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదు.

Srisailam Project: రైతులకు శుభవార్త.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుగా ప్రవహిస్తోంది! పది గేట్లు ఎత్తి దిగువకు..

ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించేంత వరకూ ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచకుండా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మొదటి దశ పనులకు టెండర్లను ఆహ్వానించింది. మెట్రో ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు నగరాల రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రజలకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తవ్వాలని ఆశిద్దాం.

Indrakiladri : ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్తులు.. తొలి రోజు బాలాత్రిపురసుందరీ రూపంలో కనకదుర్గమ్మ దర్శనం!
AP Govt: ఏపీ నిరుద్యోగ యువతకు బంపరాఫర్..! ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి కూడా ఫ్రీ..!
Vande Bharat: విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే..! కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సెన్సేషన్..!
Vande Bharath Express: ఆ రూట్లో పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్! ఇక 4 గంటల్లో తిరుపతి... అక్కడికి 9 గంటలే!
Onions Price Drop: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! అవి కేవలం రూ.2 లకే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!