Government Jobs: టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! అర్హతలు ఇవే!

ఆన్‌లైన్‌లో భోజనం ఆర్డర్ చేసే వినియోగదారులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు అయిన స్విగ్గీ, జొమాటో వసూలు చేసే డెలివరీ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధించింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారులు అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఇప్పటివరకు డెలివరీ ఛార్జీలపై పన్ను గురించి స్పష్టత లేకపోయినా, తాజా మార్పుతో ఇకపై ప్రతీ డెలివరీ ఫీజుపై పన్ను తప్పనిసరి అవుతోంది. ఫలితంగా, ఫుడ్ డెలివరీ మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది.

BSNL: గ్రామీణ, సెమీ-అర్బన్ వినియోగదారులకు గుడ్ న్యూస్! BSNL ట్రిపుల్ ప్లే సర్వీసులు..!

జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ-కామర్స్ డెలివరీ సేవలను సెంట్రల్ జీఎస్టీ చట్టం సెక్షన్ 9(5) పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం, డెలివరీ సేవలను నేరుగా అందించకపోయినా, ఈ-కామర్స్ కంపెనీలే (జొమాటో, స్విగ్గీ వంటివి) వాటిపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో డెలివరీ ఛార్జీలను డెలివరీ పార్ట్‌నర్లకు ఇచ్చే పారితోషికంగా పరిగణించేవారు, అందువల్ల పన్ను విధానం అంత స్పష్టంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డెలివరీ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు, అదనపు సర్వీస్ ఛార్జీలు అన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి.

H-1B Visa: ట్రంప్ పాలసీకి విరుద్ధంగా.. మరో ఇద్దరు భారతీయులకు బంపర్ ఆఫర్!

మోర్గాన్ స్టాన్లీ తాజా విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం జొమాటో సగటు డెలివరీ ఫీజు రూ. 11-12 ఉంటుంది. దీనిపై 18% జీఎస్టీ కలిపితే వినియోగదారులు అదనంగా రూ. 2 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్విగ్గీ సగటు డెలివరీ ఫీజు రూ. 14.5 కాగా, దానిపై జీఎస్టీ రూపంలో మరో రూ. 2.6 భారం పడుతోంది. అంతేకాకుండా వర్షం పడినప్పుడు వసూలు చేసే "రెయిన్ ఫీజు", అదనపు కన్వీనియన్స్ ఛార్జీలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. అంటే, ఇకపై ప్రతి బిల్లు మొత్తానికి కనీసం 18 శాతం అదనపు భారం తప్పనిసరి అవుతుంది.

Ukraine President: భారతీయులతో బంధం తెంచుకోలేం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు!

ఈ పరిణామంపై సోషల్ మీడియాలో వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు తమ బిల్లుల స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. ఒకరు సరదాగా "వర్షం పడితే రూ. 25 రెయిన్ ఫీజు, దానికి జీఎస్టీ కలిపి రూ. 29.50 అవుతోంది. త్వరలో సూర్యరశ్మికి కన్వీనియన్స్ ఫీజు, గాలి పీల్చినందుకు ఆక్సిజన్ మెయింటెనెన్స్ చార్జ్ కూడా వసూలు చేస్తారేమో" అంటూ కామెంట్ చేశారు. మరోవైపు, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే వాటి డెలివరీ చార్జీలు ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. అయినప్పటికీ, ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరగడం వినియోగదారులకు ఇబ్బందికరంగానే మారింది.

UIDAI: ఆధార్ కార్డు కి ఎన్ని ఫోన్ నంబర్లు లింక్ చేయొచ్చు! మీకు తెలుసా!
UN వేదికపై ట్రంప్ మాటలతో సంచలనం.. ప్రసంగం కంటే వైరల్ అవుతున్న ట్రంప్ జోక్స్!
Ration Shops: ఏపీ రేషన్ షాపులు మినీమాల్స్‌గా..! రోజంతా అందుబాటులో సర్వీసులు..!
Nara Lokesh: 15 నెలల్లో ఏపీకి రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు..! మంత్రి లోకేష్ కీలక ప్రకటన!
Tirumala first AI: దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్.. తిరుమలలో.. CBN!
PM Kisan: రైతులకు పండుగ కానుక! మీ అకౌంట్ లో డబ్బులు .. ఎప్పుడంటే?