బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు! ప్రతి ఒక్కరికీ బంగారం మీద ప్రత్యేక మక్కువ ఉంటుంది. ఈరోజు బంగారం ప్రేమికులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం రేటు, ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అయితే, ఈ తగ్గుదల ఎంతవరకు ఉంది, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పూర్తి సమాచారం తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 13 వేల మార్క్ దాటుతూ రికార్డులు సృష్టించింది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండి కూడా బంగారం బాటలోనే కదులుతోంది. నిజానికి వీటి ధరలు బులియన్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. నిన్నటితో పోలిస్తే, సోమవారం (22-09-2025) ఉదయం 6 గంటల వరకు బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల జరిగింది.
మొదటిగా 24 క్యారెట్ల బంగారం ధర.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.1,12,140 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.150 తగ్గి రూ.1,02,790 కు చేరింది
వెండి ధర కిలో రూ.100 తగ్గి రూ.1,34,900 వద్ద ఉంది.

ప్రాంతాల వారీగా చూసుకుంటే.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,12,140, 22 క్యారెట్లు రూ.1,02,790 గా ఉన్నాయి. వెండి ధర కిలో రూ.1,44,900 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,140, 22 క్యారెట్లు రూ.1,02,790 గా ఉన్నాయి. వెండి ధర కిలో రూ.1,44,900 ఉంది.
రాష్ట్రాల బయట డిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 22 క్యారెట్, వెండి కూడా స్వల్పంగా రేట్లు తగ్గాయి.
మొత్తానికి ఈ రోజు గోల్డ్, సిల్వర్ ప్రేమికులకు స్వల్పం అయినా గుడ్ న్యూస్. ఇటీవల పెరుగుదల తర్వాత కాస్త తేలిక తగులుతున్నట్లే. అయితే, మార్కెట్‌లో ధరలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కాబట్టి, కొనుగోలు ముందు తాజా రేట్లు చూడటం మేలు.