SSC: సీజీఎల్ పరీక్షల్లో సంచలనం..! రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలతో కలకలం..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో తీపికబురు రాబోతోంది. విజయవాడ-బెంగళూరు మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఇది పెద్ద సౌలభ్యం కలిగించనుంది. దాదాపు ఐదు నెలలుగా ఈ రైలుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా దీపావళి పండుగ సమయానికే ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ-బెంగళూరు ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.

New GST Rates: ఈరోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు! పేదలకు తగ్గిన అధిక భారం!

వందేభారత్ రైలును దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా ప్రారంభించే ఐదు కొత్త సర్వీసులలో భాగంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 8 నుంచి 9 గంటల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు. అలాగే విజయవాడ నుంచి తిరుపతికి కేవలం నాలుగు గంటల్లో చేరుకునే వీలు ఉంటుంది. మునుపే ఈ రైలును జూన్ లేదా జూలైలో ప్రారంభించాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే దశకు రావడంతో దీపావళి నాటికి ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

AP Secretariat: ఏపీ సచివాలయంలో విజయదశమి పూజలు.. అధికారుల్లో ఐక్యత, ఉత్సాహం పెంచిన వేడుకలు!

ఈ రైలుకు సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. విజయవాడ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా టైమ్‌టేబుల్ సిద్ధం చేశారు. మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి, రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు నేరుగా నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తున్న ఈ రైలుకు బదులుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రావడం ప్రయాణికులకు నిజంగా ఉపశమనం కలిగించనుంది.

వారికి శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు.. అక్టోబర్ మొదటి వారం నుండే!

ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుందని సమాచారం. మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు ఇది అందుబాటులో ఉంటుంది. విజయవాడలోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు ప్రాంత ప్రజలకు కూడా ఈ రైలు ఉపయుక్తం అవుతుంది. ముఖ్యంగా తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులకు నాలుగు గంటల్లోనే తిరుపతికి చేరుకునే అవకాశం రావడంతో ఈ వందేభారత్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. దీపావళి పండుగ సమయంలో ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తే, ఏపీ రైల్వే ప్రయాణాల చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుంది.

Flight Tickets: అమెరికా టికెట్ ధరల వెనుక షాకింగ్ కుట్ర..! ‘మాగా’-4చాన్ ఆపరేషన్ బహిర్గతం..!
వాహన మిత్రులకు పోలీసులు హెచ్చరిక.. నియమాలను పాటించకపోతే ఫైన్ తప్పనిసరి!
New Railway project: కేంద్రం ఆమోదంతో కొత్త రైల్వే ప్రాజెక్ట్! ఎన్నో ఏళ్ల కల... ఆ స్టేషన్ మీదుగా రెండు రైల్వే లైన్లు!
IT shares: H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్.. ఒక్క రోజులో వేల కోట్ల మార్కెట్ విలువ!
Onions Price Drop: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! అవి కేవలం రూ.2 లకే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!
Vande Bharath Express: ఆ రూట్లో పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్! ఇక 4 గంటల్లో తిరుపతి... అక్కడికి 9 గంటలే!