కొత్తగా అమలులోకి వచ్చిన జీయస్టీ 2.0 విధానం కారణంగా దేశంలో కార్ల ధరల్లో భారీ తగ్గింపులు కనిపించనున్నాయి. కారు కొనాలనుకునే ప్రజలకు ఇది నిజమైన గుడ్ న్యూస్. గతంలో ట్యాక్స్ నిబంధనలు కార్ల ధరలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు కొత్త జీయస్టీ విధానం అమలులోకి రావడంతో, ప్రత్యేకంగా ఆటోమొబైల్స్ రంగంలో పెద్ద మొత్తంలో తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వాడుకొని కార్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు మరింత లాభపడవచ్చని సూచిస్తున్నారు.
టాటా మోటార్స్‌లో టాటా నెక్సాన్‌పై 1.55 లక్షలు, సఫారీ 1.45 లక్షలు, హారియర్ 1.40 లక్షలు తగ్గింపు లభిస్తోంది. ఆల్ట్రోజ్ పై 1.10 లక్షలు, పంచ్ 85,000, టియాగర్ 80,000, టాటా టియాగో 75,000, కర్వ్ 65,000 వరకు తగ్గింపు చూపుతోంది. అలాగే మహీంద్రా కంపెనీ కార్లలో స్కార్పియో ఎన్‌పై 1.45 లక్షలు, ఎక్స్‌యూవీ 700 1.43 లక్షలు, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 1.40 లక్షలు, థార్ 1.35 లక్షలు, బొలెరో నియో 1.27 లక్షలు తగ్గింపు లభిస్తోంది.
టొయోటా మోడల్స్‌లో ఫార్చ్యూనర్ పై 3.49 లక్షలు, లెజెండర్ 3.34 లక్షలు, వెల్‌ఫైర్ 2.78 లక్షలు, హిల్లక్స్ ట్రక్ 2.52 లక్షలు, ఇన్నోవా క్రిస్టా 1.80 లక్షలు, ఇన్నోవా హైక్రాస్ 1.15 లక్షలు, క్యామ్రీ 1.01 లక్షలు తగ్గింపు పొందుతున్నాయి. హ్యుందాయ్ కార్లలో టక్సన్ పై 2.4 లక్షలు, వెన్యూ 1.23 లక్షలు, ఐ20 98,053, ఎక్స్‌టర్ 89,209, ఆరా 78,465, అల్కజార్ 75,376, గ్రాండ్ ఐ10 నియోస్ 73,808, క్రెటా 72,145, వెర్నా 60,640 తగ్గింపులు అందుతున్నాయి.
మారుతి సుజుకి, కియా, రెనాల్ట్, స్కోడా వంటి బ్రాండ్ల కార్లపై కూడా పెద్ద మొత్తంలో తగ్గింపులు ఉన్నాయి. మారుతి ఆల్‌టో కే10 40,000, ఎర్టిగా 41,000, వ్యాగన్‌ఆర్ 57,000, బలెనో 60,000, ఫ్రాంక్స్ 68,000, స్విఫ్ట్ 58,000, డిజైర్ 61,000, సెలెరియో 50,000, బ్రీజా 78,000, ఈకో 51,000, ఎస్-ప్రెస్సో 38,000, ఇగ్నిస్ 52,000, జిమ్నీ 1.14 లక్షలు, ఇన్విక్టో 2.25 లక్షలు, ఎక్స్ఎల్6 35,000 తగ్గింపు లభిస్తోంది. కియా కార్నివాల్ పై 4.48 లక్షలు, సిరోస్ 1.86 లక్షలు, సోనెట్ 1.64 లక్షలు, కారెన్స్ 48,513, సెల్టోస్ 75,372 తగ్గింపు లభిస్తోంది. రెనాల్ట్ కైగర్ 96,395, స్కోడా కోడియాక్ 3.3 లక్షలు, స్కోడా కుషాక్ 66,000, స్కోడా స్లావియా 63,000 వరకు తగ్గింపు ఉంది.