దసరా, దీపావళి పండుగలకు భారతీయులు సాధారణంగా స్వదేశంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని ఆశిస్తారు. అయితే, హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధిస్తున్నారని తెలిసిన వెంటనే, అమెరికాలోని వీసాదారుల్లో ఈ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా, పండుగలకు వెళ్లే కొన్ని ప్రణాళికలు నిలిపివేయబడ్డాయి.
ఈ నెల 19న ట్రంప్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన తరువాత, సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగాయి. హెచ్-1బి వీసాదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ భారతీయుడు తెలిపారు, స్వదేశంలో కుటుంబ సభ్యులతో పండుగలు జరపాలన్న ఉత్సాహం ఇప్పుడు చాలా తగ్గిపోయింది అని తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన హెచ్-1బి వీసాతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అయితే తన తండి వర్ధంతి కార్యక్రమం కోసం ఇటీవల అమెరికా నుంచి నాగ్‌పూర్ వచ్చాడు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు గురించి తెలియగానే ఒక్కసారిగా దిల్లిపడ్డాడు.
వెంటనే అమెరికాకు ప్రయాణం కట్టాడు. అప్పటికప్పుడు విమానం టికెట్ దొరకటమే కాదు! ప్రయాణం కష్టతరం అయిందని పేర్కొన్నాడు. నాగ్‌పూర్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి 8,000 డాలర్లు (రూ.7.04 లక్షలు) ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రోషన్ మెహతా వాపోయాడు. సాధారణ అయ్యే ఖర్చు కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. ట్రంప్ ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చి ఉంటే తనకు ఈ భారం తప్పేదని ఆవేదన వ్యక్తంచేశాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇండియాలోనే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం శుక్రవారం ఆనందంగా స్వదేశానికి బయలుదేరాడు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత ట్రంప్ విధించిన వీసా బాంబు గురించి తెలిసింది. ఇప్పుడు ఇండియాకు వెళ్తే మళ్లీ వెనక్కి వస్తామో లేదో తెలియని పరిస్థితి. దాంతో ఆ యువకుడు ఎయిర్ పోర్ట్ నుంచి మరల తన ఇంటికి వెళ్లిపోయానని. ఇండియాలో జరగాల్సిన పెళ్లి రద్దు చేసుకున్నానని తెలిపాడు. ఇప్పటికే హెచ్-1బి వీసాలు ఉన్నవారిపై లక్ష డాలర్ల రుసుము ఉండబోదని మొదటే చెబితే తనకు ఈ బాధ తప్పేదని ఆ యువకుడు తన ఆవేదను వ్యక్తంచేశారు. ఇలా మరికొందరు తమ ఆవేదన వ్యక్తపరచడం బాధాకరం.