ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో సుదీర్ఘకాల అనుబంధం ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుండగానే ఆయన కుటుంబ ఆడిటర్ గా ఆయన పనిచేశారు. అయితే జగన్ వైసీపీ స్దాపించాక అందులో చేరి ఎంపీ కావడమే కాకుండా కొన్నాళ్లు చక్రం తిప్పారు. అయితే మారిన పరిస్ధితుల్లో వైసీపీకీ, రాజకీయాలకూ గుడ్ బై చెప్పేసిన సాయిరెడ్డి.. ఇవాళ అనూహ్యంగా వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
ఇవాళ వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు కుమారుడు జగన్, కుమార్తె వైఎస్ షర్మిలతో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు వరుసగా ఎమోషనల్ గా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసారు. అయితే ఇందులో ఆయన వాడిన పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ వివాదాలతో సతమతం అవుతున్న విజయమ్మను ఉద్దేశించి నిశ్శబ్ద శక్తికి ప్రతీక అంటూ సాయిరెడ్డి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సాయిరెడ్డి తన ట్వీట్ లో శ్రీమతి వై.ఎస్.విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. అలాగే దయ, ధైర్యం మరియు నిశ్శబ్ద శక్తికి ప్రతీక అంటూ విజయమ్మను ఆకాశానికెత్తేశారు. త్యాగం, గౌరవం, విలువల పట్ల అచంచల నిబద్ధతతో కూడిన మీ జీవితం లెక్కలేనన్ని హృదయాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సాయిరెడ్డి తెలిపారు. మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆరోగ్యం, శాంతి, దైవిక కృప లభించుగాక అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
ఒకప్పుడు వైఎస్ కుటుంబ ఆడిటర్ గా పనిచేసిన సాయిరెడ్డి, ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా అత్యున్నత పదవుల్లో పనిచేశారు. అయితే జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగా పార్టీని వీడినట్లు తాజాగా ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు. జగన్ కు ఏమీ తెలియదంటూ కూడా చెప్పేస్తున్నారు. అయితే విజయమ్మ విషయంలో మాత్రం విజయసాయిరెడ్డికి ఓ క్లారిటీ ఉన్నట్లు తాజా ట్వీట్ ద్వారా అర్దమవుతోంది.

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group