NTR District: ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్‍కు కొరత లేదు.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా!

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Published : 2026-04-27 00:11:00

ఒకేసారి ఫుల్ ట్యాంకులు చేయించడం వల్ల నోస్టాకు బోర్డు పెడుతున్నారు..

కొండపల్లి పెట్రోల్, డీజిల్ సరఫరా కంపెనీలతో మాట్లాడాం..

ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారాలు పూర్తిగా అసత్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ రూమర్లను నమ్మి చాలా మంది అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ఫుల్ ట్యాంక్‌లు చేయించుకుంటున్నారని చెప్పారు. దీంతో కొన్ని బంకుల వద్ద తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని వివరించారు.

కొండపల్లి ప్రాంతంలోని పెట్రోల్, డీజిల్ సరఫరా కంపెనీలతో ఇప్పటికే మాట్లాడినట్లు, సాధారణంగా వచ్చే సరఫరా కంటే 20 శాతం అదనంగా ఇంధనం జిల్లాకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ వ్యవహారాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు వెల్లడించారు. అయితే కమర్షియల్ డీజిల్ కొనుగోలు చేసేవారు కూడా రిటైల్ బంకులకు రావడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు.

ప్రజలు క్యూలైన్ల ప్రకారం వెళ్లి తమ వంతు వచ్చినప్పుడు మాత్రమే పెట్రోల్, డీజిల్ తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు, ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు.

వ్యవసాయం, ఆక్వా రంగం, ఆస్పత్రులు, అంబులెన్సులకు ఇంధన సరఫరాలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని జేసీ తెలిపారు. ఎవరైనా సమస్యలు ఎదురైతే ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70545 కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా సహకరిస్తే ఇలాంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

Tags #Fuel

Spotlight

Read More →