LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Rao Surname History: మీరు 'రావు' అని పిలిపించుకుంటున్నారా? అయితే ఈ రాజసం వెనుక ఉన్న రహస్యం ఇదీ!

Rao Surname History: చాలామంది తెలుగు వారి పేర్ల చివర 'రావు' అని ఉంటుంది. అసలు ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? సంస్కృతంలోని 'రాజా' అనే పదం 'రావు'గా ఎలా రూపాంతరం చెందింది? విజయనగర రాజుల కాలం నుండి నేటి వరకు ఈ బిరుదు ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు..

AndhraPravasi News Desk 2 min read
Rao Surname History: మీరు 'రావు' అని పిలిపించుకుంటున్నారా? అయితే ఈ రాజసం వెనుక ఉన్న రహస్యం ఇదీ!

Rao Surname History: మనం రోజూ ఎంతో మందిని కలుస్తుంటాం ఎన్టీ రామారావు దగ్గరి నుండి నిన్న మొన్న పుట్టిన చిన్నారి వరకు.. పురుషుల పేర్ల చివర 'రావు' అనేది ఒక గౌరవ సూచికగా మారిపోయింది. నాగేశ్వరరావు, హనుమంతరావు, వెంకటేశ్వరరావు, బాబురావు.. ఇలా ఏ పేరు విన్నా అందులో ఒక రాజసం కనిపిస్తుంది. అసలు ఈ 'రావు' అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఇది కేవలం ఒక కులానికి సంబంధించిందా లేక ఒక హోదాకు గుర్తా? దీని వెనుక దాదాపు వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర దాగి ఉంది.

'రాజా' నుండి 'రావు' వరకు..

భాషా పరంగా చూస్తే, 'రావు' అనే పదం సంస్కృతంలోని 'రాజా' అనే పదం నుండి పుట్టింది. ప్రాకృత భాషా ప్రభావంతో 'రాజా' కాస్త 'రాయ'గా మారింది. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తులను మనం 'రాయలు' అని పిలిచేవాళ్లం. కాలక్రమేణా మరాఠీ, తెలుగు భాషల్లో ఈ రాయ అనే పదం మరింత మార్పులకు లోనై 'రావు'గా స్థిరపడింది. అంటే దీనికి మూల అర్థం 'ప్రభువు' లేదా 'నాయకుడు' అని అర్థం. ప్రసిద్ధ భాషావేత్త సి.పి. బ్రౌన్ తన నిఘంటువులో కూడా రావు అంటే ఒక ఉన్నత సామాజిక హోదాకు చిహ్నమని పేర్కొన్నారు.

విజయనగర సామ్రాజ్యం - మరాఠా ప్రభావం

చారిత్రక ఆధారాల ప్రకారం, విజయనగర చక్రవర్తులు తమను తాము 'రాయలు' అని పిలుచుకునేవారు. కానీ వారి కింద పనిచేసే సేనాధిపతులకు, సామంతులకు  విధేయులకు 'రావు' అనే బిరుదును ఇచ్చేవారు. అంటే 'రాయ' అనేది సర్వాధికారికి ఉంటే, 'రావు' అనేది ఆ అధికారి కింద పనిచేసే నాయకత్వానికి గుర్తుగా ఉండేది. ఆ తర్వాత మరాఠా పాలకుల కాలంలో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. దక్కన్ ప్రాంతానికి వలస వచ్చిన మరాఠా అధికారులు, బ్రాహ్మణ ఉద్యోగుల ద్వారా ఈ పదం తెలుగు నేలపై విస్తృతంగా వ్యాపించింది.

సామాజిక వర్గాల్లో విస్తరణ

ప్రారంభంలో కేవలం పాలకులకే పరిమితమైన ఈ పేరు, క్రమంగా వివిధ సామాజిక వర్గాల్లోకి చేరింది. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గం వారు జమీందారులుగా ఉండటం వల్ల ఇది వారి వంశ పారపర్య బిరుదుగా మారింది. అలాగే కమ్మ సామాజిక వర్గంలో కూడా బ్రిటీష్ కాలం నుండి తమ గౌరవార్థం ఈ పదాన్ని చేర్చుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. బ్రాహ్మణులలో నియోగులు ప్రభుత్వ పాలనలో, కరణాలుగా పనిచేయడం వల్ల తమ అధికారానికి గుర్తుగా 'రావు'ను వాడటం ప్రారంభించారు. కేవలం వీరే కాకుండా కాపు, ముదిరాజ్ వంటి ఇతర సామాజిక వర్గాలు కూడా తమ పూర్వీకుల యోధత్వానికి గుర్తుగా ఈ పదాన్ని గౌరవంగా స్వీకరించారు.

బ్రిటీష్ కాలంలో ‘రావు బహదూర్’

బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో, సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారికి 'రావు బహదూర్' అనే బిరుదును ఇచ్చేవారు. ఇది ఒక గొప్ప పురస్కారంగా పరిగణించబడేది. ఆ బిరుదు పొందిన వారు తమ సంతానానికి కూడా ఆ పేరు కలిసొచ్చేలా 'రావు' అని పెట్టడం మొదలుపెట్టారు. అలా ఇది ఒక వ్యక్తిగత బిరుదు స్థాయి నుండి కుటుంబాల గౌరవ చిహ్నంగా మారిపోయింది. నేటికీ మన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు వంటి ఎంతో మంది మేధావుల పేర్లలో ఈ పదం మనం చూడవచ్చు.

 ఒక సాంస్కృతిక వారసత్వం

నేడు 'రావు' అనేది కేవలం ఒక పేరు కాదు, అది ఒక సంస్కృతి. కులమతాలకు అతీతంగా విద్యావంతులు, గౌరవనీయ వ్యక్తులు తమ పేర్ల చివర దీనిని ధరిస్తున్నారు. నాగేశ్వరరావు లాంటి పేర్లు పెట్టడం వెనుక తమ పిల్లలు కూడా భవిష్యత్తులో ఆ బిరుదుకు తగినట్లుగా సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే తల్లిదండ్రుల ఆకాంక్ష కనిపిస్తుంది. శాసనాల కాలం నుండి నేటి స్మార్ట్‌ఫోన్ యుగం వరకు ఈ 'రావు' అనే రెండు అక్షరాలు తెలుగు వారి చరిత్రలో ఒక చెరగని ముద్రగా మిగిలిపోయాయి.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…