సమంత తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అద్భుతమైన నటి. ఆమె అందం, నటన ప్రతిభ, ప్రత్యేకమైన స్టైల్ వల్ల ప్రేక్షకులను వెంటనే ఆకర్షిస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటన ఆమెకు కొన్ని కోట్ల లక్షల అభిమానులను సంపాదించి పెట్టింది.
సమంత సోషల్ మీడియాలోకూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది, ఫ్యాన్స్‌తో నేరుగా కమ్యూనికేట్ చేస్తుంది. సినిమా ప్రియులకు, ఫ్యాషన్ అభిమానులకు సమంత ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచే వ్యక్తి.
ఈ మధ్యకాలంలో సమంత ఆరోగ్యపరంగా చాలా కేర్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియా లో జిమ్ వర్కౌట్స్ చేస్తే ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదిక పోస్ట్ చేస్తూ తన స్ట్రాంగ్ అని తెలిసేలా చేస్తుంది.ఫ్యామిలీ మాన్ సిరీస్ తో తన వివాహ బంధం లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ అవి ఇవి పట్టించుకోకుండా తన యాక్టింగ్ పైన తన కెరియర్ కొనసాగిస్తుంది.
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసినదే.
సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. అదేవిధంగా సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో సమంత ఎక్కడున్నా తన పక్కనే రాజు నిడుమోరు ఉండడంతో వీరి మధ్య రిలేషన్ కొనసాగుతుందేమోనని భావన అందరిలోనూ కలుగుతుంది.
రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసినదే. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారని సినీ పరిశ్రమలో కూడా ప్రచారం జరిగినది.
ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది. ఇక ముంబైలో ఒకే కారులో వెళ్తూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. ఇటీవలే సమంత ప్రియుడితో కలిసి జిమ్ నుంచి బయటకు వస్తోన్న వీడియో సైతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
దుబాయ్ ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన నటి సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్‌లో, ఆమె ఒక వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది ఆమె స్పష్టంగా చెప్పలేదు.నెటిజన్లు, అభిమానులు ఆ చేయిని పరిశీలించి, 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుదేనని గుర్తించడం జరిగినది. దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసుకుంటూ ఈ జంట కంగ్రాట్స్ చెబుతున్నారు. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఏదేమనప్పటికీ సమంత లేదా చూడాల్సిందే మరి.