Forest Project: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగర వనాల ప్రాజెక్ట్..! ప్రతీ నియోజకవర్గంలో పచ్చదనం పెంపు!

జీఎస్టీ సంస్కరణల అనంతరం స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల ట్రెండ్ బాగా కదిలింది. వరుసగా పెద్ద కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులను సమీకరించేందుకు దూకుతున్నాయి. తాజగా టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓకు ముహూర్తం ఖరారైంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 6 నుంచి 8 వరకు జరగనుందని టాటా గ్రూప్ వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ద్వారా రూ.17,200 కోట్ల నిధులను సమీకరించడమే కంపెనీ లక్ష్యం. అక్టోబర్ 9న షేర్ల అలాట్‌మెంట్, అక్టోబర్ 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టింగ్ జరగనుంది. మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ ఏడాది దేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలవే అవకాశం ఉంది.

తీవ్ర విషాదం.. టాలీవుడ్ నటికి కాబోయే భర్త ఆత్మహత్య! జూబ్లీహిల్స్‌లో కలకలం..

ఐపీఓ ప్రారంభానికి ముందే టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఈక్విటీ షేర్ల ధరలను ప్రకటించింది. ఈ షేర్ల ముఖ్య విలువ రూ.10, కనీస ధర రూ.310, గరిష్ఠ ధర రూ.326గా నిర్ణయించబడింది. ఒక్కో లాట్‌లో కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే, కనీసంగా రూ.14,260 పెట్టుబడి, గరిష్ఠ ధర వద్ద రూ.14,996 పెట్టుబడి అవసరం. దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు, వ్యక్తిగత పెట్టుబడిదారులు ఈ ఐపీఓలో భాగం కావచ్చు.

హైఅలర్ట్.. కేరళలో భయంకర వ్యాప్తి! 'బ్రెయిన్-ఈటింగ్ అమీబా' బలి.. 20 మంది మృతి!

ఐపీఓలో షేర్ల కేటాయింపు ఇలా ఉంది: 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII), మిగిలిన 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు. అదనంగా, ఎంప్లాయీ పోర్షన్ కింద 12,00,000 షేర్లు ఉద్యోగులకు కేటాయించబడ్డాయి. ఈ విధంగా అన్ని రకాల ఇన్వెస్టర్లకు అవకాశాన్ని కల్పించడం ద్వారా ఐపీఓ మరింత సక్సెస్ అవ్వడం ఆశించవచ్చు.

అమరావతిలో 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం – మరో చరిత్రకు నాంది!

ఈ ఐపీఓ మార్కెట్‌లో పెద్ద వర్షంలా నిలిచే అవకాశం ఉంది. టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించగలదని నిపుణులు అంటున్నారు. అంతేకాక, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, స్టాక్ మార్కెట్‌లో హంగామా సృష్టించడం, కంపెనీ బ్రాండ్ విలువను మరింత పెంచడం వంటి లాభాలు ఈ ఐపీఓకు ఎదురవుతాయి. జీఎస్టీ సవరణల తర్వాత స్టాక్ మార్కెట్‌లో వచ్చిన ఈ అవకాశాలు, పెట్టుబడిదారులకు కొత్త డెస్టినేషన్‌లను అందిస్తున్నాయి.

Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికారికంగా ప్రారంభం..! పూర్తి షెడ్యూల్ విడుదల!
ICAR- CRRI Recruitment: యంగ్ ప్రొఫెషనల్స్-I భర్తీ కి ఆహ్వానం! అర్హత, వయస్సు, ఎంపిక వివరాలు!
Personal loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? వాటిపై అవగాహన లేకుంటే భారీ నష్టాలు తప్పవు..!
Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు అద్భుతం! టీటీడీని ప్రశంసించిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్‌పై వరుణుడి ఆగ్రహం.. మరో మూడు రోజులు ఆ ప్రాంతాలకు వర్షాల ముప్పు!
వలస కూలీలకు గుడ్ న్యూస్.... ఇంత తక్కువ ధరకే భోజనం! టేస్ట్ మాత్రం ఆహా అనాల్సిందే!!