ఇంటిని అందంగా ఆకర్షణీయంగా మార్చడం కోసం చాలా మంది వేర్వేరు రకాల చెట్లు మొక్కలు నాటతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని చెట్లు ఇంటి ముందు లేదా ప్రాంగణంలో పెంచకూడదని కూడా హెచ్చరిస్తారు. అందులో ముఖ్యంగా అరటి చెట్టు, దానిమ్మ చెట్టు.
వాస్తు నిపుణుల సూచన ప్రకారం, ఇంటి ముందు అరటి చెట్టు, దానిమ్మ చెట్టులు పెంచడం మంచిది కాదట. ఈ చెట్టులు ఇంటి ఆర్థిక పరిస్థితి, కుటుంబ శాంతి, సంతోషంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది అని తెలుపుతున్నారు. పిల్లల ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం కూడా కొంతమేర ప్రభావితం అవుతాయట.
ఇంకా ఇంటి చుట్టూ కూడా అరటి చెట్టును నాటకూడదని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు శుభానికి ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో పెంచితే డబ్బు సమస్యలు, గొడవలు, చికాకులు రావచ్చు. అరటి చెట్టు ఒక్క మొక్క పెట్టడం ద్వారా అక్కడ గుబురుగా ఏర్పడుతుందో అనేక కీటకాలు అక్కడకు చేరుతాయి అది పిల్లలకు కుటుంబ సభ్యులకు హానికరం అవుతుంది. అలానే దానిమ్మ చెట్టు పువ్వల సువాసనకి పాములు అధికంగా వస్తాయట హానికరంగా భావించవచ్చు
అందుకే, ఇంటి ముందు, ప్రాంగణంలో అరటి చెట్టు, దానిమ్మ చెట్టు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.అందుకు బదులుగా ఇంటికి శుభ్రత సౌందర్యం, సంతోషం తీసుకువచ్చే చెట్లు పూల మొక్కలు తులసి మొక్కలు పెంచడం మంచిది. పూల చెట్లు ఇంటి ముందు లేదా ప్రాంగణంలో పెంచితే శాంతి, ఆనందం, సానుకూల వాతావరణం నెలకొంటుంది.
ఇంటి కోసం సరైన వాతావరణాన్ని సృష్టించడానికి వాస్తు సూచనలు పాటించడం అవసరం. శుభప్రదమైన సౌందర్యాన్ని పెంచే చెట్లు, పూల మొక్కలను నాటడం ద్వారా కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం ఉంటుందట.