ఓటీటీలో దసరా ధమాకా.. తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఉత్కంఠ రేకెత్తిస్తోంది!

మురళి సాయి పెనగంటి కోసం సహాయం కోరుతున్న తల్లిదండ్రులు, స్నేహితులు… అమెరికాలో చదువుకుంటూ, మంచి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న యువకుడు మురళి సాయి పెనగంటి (24) అరుదైన వ్యాధి బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈమధ్యే అతనికి ఫైర్స్ (Febrile Infection-Related Epilepsy Syndrome) అనే ప్రమాదకరమైన నాడీ సంబంధ వ్యాధి సోకింది. ఒక్క రాత్రిలో అతని జీవితం మొత్తం మారిపోయింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి గుడ్‌న్యూస్.. 8 వరసల రహదారితో 2 గంటల్లోనే హైదరాబాద్ - విజయవాడ!

మార్చి 13, 2025 నుండి మురళి నిరంతరం సీజ్‌ర్స్‌తో బాధపడుతున్నాడు. అమెరికాలోని ఒక్లాహోమా, టెక్సాస్ రాష్ట్రాల ఆసుపత్రుల్లో చికిత్స కూడా చేసినా ఎం ఉపయోగం లేకుండా పోయింది. చివరగా బేలర్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, ఫోర్ట్ వర్త్‌లో వైద్యులు ప్రత్యేక న్యూరాలజీ చికిత్స అందిస్తున్నారు. ట్రాకియోస్టమీ, పేగ్ ప్లేస్‌మెంట్, అలాగే రిటుక్సిమాబ్, టోసిలిజుమాబ్ వంటి ప్రత్యేక ఔషధాల ద్వారా చికిత్స కొనసాగుతుంది. అనేక వారాలు అతను ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో లక్షలాది రూపాయల ఖర్చులు కుటుంబంపై భారమయ్యాయి.

South Korea CII సదస్సు! రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం... LG కు ప్రత్యేక ఆహ్వానం!

ఇప్పటివరకు స్నేహితులు, దాతలు అందించిన సహకారంతో మురళి ప్రాణరక్షణ చికిత్స పొందగలిగాడు. అతని అన్న శివ ప్రసాద్ పెనగంటి కూడా అన్నయ్యగా అమెరికాలో అతని పక్కనే ఉండి ఆపన్నహస్తం అందిస్తున్నాడు. కానీ, వైద్యులు ఇప్పుడు మురళిని త్వరగా స్వదేశానికి తరలించి తల్లిదండ్రుల సమక్షంలోనే రీహాబిలిటేషన్, న్యూరాలజీ చికిత్స కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల అండ మురళి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Students: విద్యార్థినులకు గుడ్ న్యూస్! 37,000 మందికి పైగా.. ప్రతి ఏటా రూ.30 వేల సాయం!

అయితే, మురళిని ఇండియాకు తీసుకురావడం అంత తేలికైన పని కాదు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి కారణంగా సాధారణ ప్రయాణం కుదరదు. ప్రత్యేక వైద్య సిబ్బందితో కూడిన ఎయిర్ అంబులెన్స్ అవసరం. ఈ ప్రయాణానికి డాక్టర్లు, నర్సులు కూడా వెంట ఉండాలి. మొత్తం ఖర్చు సుమారు 20 వేల అమెరికన్ డాలర్లు (భారతీయ రూపాయల్లో సుమారు 16-17 లక్షలు) అవుతుంది. ఇదే కాకుండా ఇండియాలో రీహాబిలిటేషన్, థెరపీ కోసం కూడా ఖర్చులు భారీగా ఉంటాయి.

Hero Bikes: i3S టెక్నాలజీ, కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన Hero HF Deluxe 2025!

మురళి ఆరోగ్య బీమా జూలై 31, 2025తో ముగిసిపోయింది. అంతకుముందే కుటుంబం మురళి చదువుల కోసం రూ.40 లక్షల విద్యా రుణం తీసుకుంది. ఈ కొత్త ఆర్థిక భారం భరించడం వారికి సాధ్యమవడం లేదు. అందుకే తల్లిదండ్రులు, అన్న, స్నేహితులు ప్రజల సహాయం కోసం అర్థిస్తున్నారు. 

తుకమ్మ పాటలతో హోరెత్తిన అమెరికా.. నార్త్ కరోలినాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

“ప్రతి రూపాయి మురళిని స్వదేశానికి తీసుకురావడానికి దగ్గర చేస్తుంది. ఎవరు ఎంత ఇచ్చినా అది మా కుటుంబానికి చాలా విలువైనదే. ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా, ఈ సమాచారం మీ పరిచయాల్లో పంచుకుంటే చాలు. అది కూడా మా కొడుక్కి ప్రాణదాయకమవుతుంది” అని మురళి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Goat Farmers: గొర్రెలు, మేకల పెంపకందార్లకు కీలక సూచన: బీమా లేకపోతే భారీ నష్టాలు తప్పవు..!

ఇప్పటికే అందరి సహకారంతో చాలా వరకు వైద్య ఖర్చులు తీర్చగలిగారు. కానీ ఇప్పుడు మురళిని ఇంటికి తీసుకురావడం అత్యవసరం. తన తల్లిదండ్రుల అండదండలతో అతను మెల్లగా కోలుకోవాలని కుటుంబం కోరుకుంటోంది.

ఏపీలో రెండు ప్రాంతాల మధ్య కొత్త కనెక్టివిటీ! బ్రేకింగ్ ఆఫర్.. విమాన టికెట్ కేవలం రూ. 1,499 మాత్రమే!

ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో ముఖ్యమని స్నేహితులు చెబుతున్నారు. చిన్న సహాయం కూడా మురళి ప్రాణానికి ఆశగా మారుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేయమని ఆ కుటుంబం అందరినీ వేడుకుంటోంది. మురళి మళ్లీ ఆరోగ్యవంతుడై తన కలలు నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ రోజు త్వరలో రావాలని ఆయన కుటుంబం కన్నీళ్లతో ఎదురుచూస్తోంది. 

Zomato: జొమాటో హెల్తీమోడ్! ఆహారంతో పాటు ఆరోగ్యం మీ ఇంటికే..!

అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే విధంగా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు  ఇక్కడ ఇచ్చిన గో-ఫండు లింకు ద్వారా అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. https://gofund.me/a621e2732

పండగ స్పెషల్.. ఆ 1, 2 తేదీల్లో గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్ విడుదల!