ఏపీలో రెండు ప్రాంతాల మధ్య కొత్త కనెక్టివిటీ! బ్రేకింగ్ ఆఫర్.. విమాన టికెట్ కేవలం రూ. 1,499 మాత్రమే!

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోసం గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి ఉంటాయి. వ్యవసాయానికి అనుబంధ రంగంగా ఈ జీవాల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. లక్షల సంఖ్యలో ఉన్న గొర్రెలు, మేకల ద్వారా రైతులు, కూలీలు ఆర్థికంగా ఆధారపడుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో వర్షాలు, పిడుగులు, వ్యాధుల కారణంగా ఈ జీవాలు చనిపోవడం పెరిగింది. దీనివల్ల పెంపకందార్లు భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తక్కువ ప్రీమియంకే బీమా సదుపాయాన్ని అందిస్తుండగా, అవగాహన లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.

Zomato: జొమాటో హెల్తీమోడ్! ఆహారంతో పాటు ఆరోగ్యం మీ ఇంటికే..!

ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం రైతులకు భరోసా కలిగించగలదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి కేవలం రూ.36, రెండేళ్లకు రూ.54, మూడేళ్లకు రూ.75 మాత్రమే చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. ఇతర యజమానులు కూడా తక్కువ ప్రీమియంతోనే బీమా పొందవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ.90, రెండేళ్లకు రూ.135, మూడేళ్లకు రూ.187 చెల్లించాలి. ఒకవేళ మేకలు లేదా గొర్రెలు పిడుగుపాటు, వ్యాధులు, వర్షాలు వంటి కారణాలతో చనిపోతే ఒక్కో జీవానికి రూ.6 వేల వరకు పరిహారం ప్రభుత్వం అందిస్తుంది. కానీ, బీమా చేయించుకోని రైతులు మాత్రం భారీగా నష్టపోతున్నారు.

పండగ స్పెషల్.. ఆ 1, 2 తేదీల్లో గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్ విడుదల!

రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం ఈ మూగజీవాలకు పెద్ద సవాలుగా మారింది. అడవులు, గుట్టలు, బీడు భూముల్లో మేపే గొర్రెలు, మేకలు వర్షాలకు తడిసి చలికి గురవుతున్నాయి. నిరంతరం కురిసే వర్షాలతో మేత దొరకక ఆకలికి అలమటిస్తాయి. చలిగాలులు, నీటి నిల్వల వల్ల వ్యాధులు సోకుతాయి. పైగా పిడుగుపాటుకు వందలాది జీవాలు చనిపోతున్నాయి. రైతులు వేసవిలో వాటిని చెట్ల కింద విశ్రాంతి కల్పించి కాపాడుతారు. కానీ వర్షాకాలంలో వందలాది జీవాలను రక్షించడం కష్టతరమవుతోంది. దీంతో పెంపకందార్లు ఒక్కసారిగా ఆదాయ వనరులు కోల్పోతున్నారు.

కుక్క గోరు గీసుకుంది కదా అని వదిలేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

వేసవిలో గొర్రెల మలాన్ని సేంద్రియ ఎరువుగా పొలాలకు అమ్మి రైతులు మంచి ఆదాయం పొందుతారు. ఒక రోజుకు రూ.1000 నుండి రూ.5000 వరకు సంపాదించగలరు. కానీ వర్షాలు, పిడుగులు, వ్యాధుల కారణంగా జీవాలను కోల్పోతే ఈ ఆదాయ వనరు ఆగిపోతుంది. అందుకే బీమా చేయించుకోవడం పెంపకందార్లకు రక్షణ కవచం అవుతుంది. ప్రభుత్వం తక్కువ ప్రీమియంకే బీమా అందిస్తుండగా, రైతులు అవగాహన పెంచుకొని తప్పనిసరిగా ఈ పథకం ఉపయోగించుకోవాలి. బీమా ద్వారా మాత్రమే ఆర్థిక భద్రత లభించి, అనుకోని విపత్తుల్లో కుటుంబాలు రుణ ఊబిలో చిక్కుకోవడం తప్పించుకోగలవు.

Bar Council: ఏపీ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం! ఒక్కొక్కరికి రూ.9 లక్షల వరకు ప్రయోజనం!
TATA Capital: టాటా క్యాపిటల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్..! కోట్ల లక్ష్యంతో భారీ అవకాశాలు..!
Forest Project: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగర వనాల ప్రాజెక్ట్..! ప్రతీ నియోజకవర్గంలో పచ్చదనం పెంపు!
తీవ్ర విషాదం.. టాలీవుడ్ నటికి కాబోయే భర్త ఆత్మహత్య! జూబ్లీహిల్స్‌లో కలకలం..
హైఅలర్ట్.. కేరళలో భయంకర వ్యాప్తి! 'బ్రెయిన్-ఈటింగ్ అమీబా' బలి.. 20 మంది మృతి!
అమరావతిలో 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం – మరో చరిత్రకు నాంది!