వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై మరో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్న సమయంలో, గత మూడేళ్లుగా చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించారని, ఒక మహిళగా ఆ తిట్లను భరించలేకపోయానని పేర్కొంటూ ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా, ఐటీ చట్టంలోని సెక్షన్లు 353(2), 352, 351(4) కింద సి.ఐ. రమణయ్య కేసు నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు, విచారణకు హాజరు కావాలని కోరుతూ 41 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు.