ఐరోపా దేశాల పర్యటనకు ఏటా లక్షలాది మంది విదేశీయులు వెళుతుంటారు. అయితే, షెంజెన్ వీసా దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో తిరస్కరణలు చోటు చేసుకోవడంతో దరఖాస్తుదారులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన వీసా దరఖాస్తులు సైతం లక్షల్లో తిరస్కరణకు గురవుతున్నాయి.
దరఖాస్తుల తిరస్కరణ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇది కూడా చదవండి: గుంటూరు ఉద్యాన రైతులకు గుడ్ న్యూస్..! వాటి సాగుపై రాయితీ పెంపుదల!
షెంజెన్ సభ్యదేశాలకు గత ఏడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు కాండ్ నాస్ట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ దరఖాస్తు రుసుముల ద్వారా రూ.1,410 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా.
భారత్ నుంచి 11.08 లక్షల వీసా దరఖాస్తులు రాగా, వాటిలో 1.65 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది జూన్‌లో వీసా రుసుమును 80 నుంచి 90 యూరోలకు పెంచిన నేపథ్యంలో, సగటున 85 యూరోలుగా పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.136 కోట్లు నష్టపోయినట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: