జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్‌ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.
కావలి టూ టౌన్ సీఐ గిరిబాబు (CI Giribabu) ఓవరాక్షన్ చేశారు. పైలాన్ విధ్వంసం కేసులో విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి (YSRCP Leader Ramireddy Pratap Kumar Reddy) సీఐ రాచమర్యాదలు చేశారు. విచారణ నిమిత్తం రామిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో రామిరెడ్డి కారు వద్దకు వెళ్లిన సీఐ.. ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికి స్వయంగా వెంటబెట్టుకుని స్టేషన్ లోపలికి వెళ్లారు. దీంతో సీఐ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల తీరు చూస్తే విచారణ ఎలా పారదర్శకంగా సాగుతుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?
జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్‌ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు రామిరెడ్డి. ఇదిలా ఉండగా పైలాన్ ధ్వంసం కేసులో విచారణకు రావాల్సిందిగా రామిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ కేసుకు విచారణ అధికారిగా సీఐ గిరిబాబు ఉన్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న రామిరెడ్డి విచారణ నిమిత్తం ఈరోజు (శుక్రవారం) టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఆయన వచ్చిన విషయం తెలిసిన వెంటనే సీఐ గిరిబాబు పరుగులు తీసుకుంటూ కారు వద్దకు వెళ్లి రామిరెడ్డికి నమస్కారాలు పెడుతూ, రాచమర్యాదలు చేస్తూ వెంటబెట్టుకుని మరీ పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకొచ్చారు. ఈ సన్నివేశాలు ఇప్పుడు కావాలిలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఒక విచారణాధికారిగా ఉన్న సీఐ గిరిబాబు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేకు రాచమర్యాదలు చేయడంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!
వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!
ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!
పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..
అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: