భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు. NB.1.8.1 కొవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్‌లో తమిళనాడులో నమోదయింది. మే నెలలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ రెండు సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది.
చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కొవిడ్ సంబంధిత మరణం నమోదయింది. కొవిడ్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో నాల్గవ కొవిడ్-19 మరణం నమోదయింది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు.
ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్ కల్యాణ్ డీప్‌గా హర్ట్ - ఏపీ మంత్రి హెచ్చరిక!
శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..
ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?
దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!
ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!
ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?
జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!
మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!
బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: