Header Banner

వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!

  Mon May 26, 2025 06:59        Politics

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ జోరుగా సాగుతుంది. రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త కార్డులు, కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో.. సర్వర్లు బిజీ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో కూడా రేషన్ కార్డుల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు పొందాలంటే.. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి.

అయితే ఇదేమి కొత్త నంబర్ కాదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర (వాట్సాప్‌ గవర్నెన్స్‌) సర్వీసే. దీనిలో ఇకపై రేషన్ కార్డు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా రేషన్ కార్డులో మార్పుచేర్పులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. అయితే ఇందులో 8 రకాల సేవలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చినా.. కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలంటే మాత్రం.. సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే..

  • ముందుగా మొబైల్‌ ఫోనులో ‘మనమిత్ర’ వాట్సాప్‌ చాట్‌లోకి వెళ్లాలి.
  • ‘హాయ్‌’ అని మెసేజ్ చేస్తే.. సేవను ఎంచుకోండి అని వస్తుంది.
  • దానిని క్లిక్‌ చేస్తే పౌర సేవను ఎంచుకోండి అనే బాక్స్‌ కనిపిస్తుంది.
  • దానిలో సివిల్‌ సప్లయిస్‌ సేవలు ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇక్కడ 8 రకాల సేవలు కనిపిస్తాయి.
  • అవి దీపం స్థితి, రేషన్ డ్రా స్థితి, రేషన్ ఈకేవైసీ స్థితి, రేషన్ కార్డు సమర్పణ, రేషన్ కార్డులో సభ్యులను చేర్చడం, తొలగించడం, తప్పుగా ఉన్న వివరాల సవరణ, రేషన్‌ కార్డ్‌ విభజన దరఖాస్తు అప్షన్స్ ఉంటాయి.
  • వీటిల్లో మీకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. వాట్సాప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర సేవల కోసం ఈ నెల 7నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారీసంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. సర్వర్లు డౌన్‌ అవ్వడం, ఇతర సమస్యల వల్ల ఆన్‌లైన్‌ చేయడంలో బాగా ఆలస్యం జరుగుతోంది.

దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా ‘మనమిత్ర’ (వాట్సాప్‌ గవర్నెన్స్‌) సేవలను ఈ నెల 15 నుంచే అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. చివరకు శనివారం నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కార్డుకు అప్లై చేసుకునేవారు మినహా.. మిగిలిన వారు.. ఇంటి నుంచే తమకు కావాల్సిన రేషన్ కార్డు సేవల కోసం అప్లై చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RationCard #WhatsAppServices #DigitalIndia #GovtServices #PublicWelfare #EasyAccess #RationCardUpdate