LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
National

World Wildlife Day: అటవీ శాఖ చరిత్రలో కొత్త అధ్యాయం.. వన్యప్రాణుల రక్షణపై పవన్ కల్యాణ్ క్లారిటీ...!

AP Wildlife Protection Project: మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ వేదికగా జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఏనుగుల దాడి నుంచి రైతులను కాపాడేందుకు, అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వన్యప్రాణులు-మనుషుల …

AndhraPravasi News Desk 2 min read
World Wildlife Day: అటవీ శాఖ చరిత్రలో కొత్త అధ్యాయం.. వన్యప్రాణుల రక్షణపై పవన్ కల్యాణ్ క్లారిటీ...!

AP Wildlife Protection Project: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ చరిత్రలో ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ వేత్తలకు, జంతు ప్రేమికులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో వన్యప్రాణుల పాత్ర ఎంతో కీలకమని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

వన్యప్రాణులు  మనుషుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను  తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని పవన్ కల్యాణ్ వివరించారు. అడవి నుంచి జంతువులు జనావాసాల్లోకి రాకుండా చూడటం, అదే సమయంలో మనుషుల నుంచి వన్యప్రాణులకు ముప్పు కలగకుండా జాగ్రత్త పడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన  చెప్పుకొచ్చారు. వన్యప్రాణుల రక్షణ కేవలం అటవీ శాఖ పని మాత్రమే కాదని, సామాన్య ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా రాష్ట్రంలో రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. చిత్తూరు జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అటవీ సరిహద్దుల్లో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నామని తెలిపారు. ఏనుగులు అడవి దాటి బయటకు వస్తున్నప్పుడు రైతులను ముందే అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

అటవీ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జంతువులు పొలాల్లోకి గానీ, గ్రామాల వైపు గానీ వస్తున్నప్పుడు సెన్సార్ల ద్వారా లేదా మొబైల్ మెసేజ్‌ల ద్వారా గ్రామస్తులను అలర్ట్ చేసే ప్రక్రియను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల అటు జంతువులకు, ఇటు ప్రజలకు సురక్షితమైన వాతావరణం కలుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చివరగా, అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అడవుల విస్తీర్ణం పెంచేందుకు, వన్యప్రాణుల సంఖ్యను వృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. గతంలో కంటే భిన్నంగా, అత్యాధునిక పరికరాలు  పటిష్టమైన నిఘా వ్యవస్థతో అటవీ సంపదను కాపాడుకుంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Be the first to react

More Coverage

Modi: ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోదీ.. అంతర్జాతీయ సవాళ్లపై కీలక చర్చలు!

Modi: ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోదీ.. అంతర్జాతీయ సవాళ్లపై కీలక చర్చలు!

Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని ఎవియన్ నగరంలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనన…

Ram Mohan Naidu: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!

Ram Mohan Naidu: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!

Ram Mohan Naidu: ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమ…