Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!

ఒక్కవైపు భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తూ వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా, మరోవైపు పాకిస్థాన్‌తో మాత్రం స్నేహ హస్తం చాస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌ నుంచి వచ్చే ఎగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్న తరుణంలో, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటనకు సిద్ధమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాసియాలో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Modi visits China: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనాకు... ప్రధాని మోదీ!

భారత్‌ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నదాన్ని కారణంగా చూపుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించినట్టు ప్రకటించారు. దీంతో మొత్తం టారిఫ్‌ భారము 50 శాతానికి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపైనా ఇలాగే వ్యవహరించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు.

Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!

అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ‘‘ఈ చర్య అన్యాయం, కారణం లేని చర్య, అంతే కాకుండా అసమర్థనీయం’’ అని వ్యాఖ్యానించింది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా చమురు కొనుగోళ్లు చేస్తున్నామని, 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రతే తమ లక్ష్యమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి చర్యలు తీసుకోవడం శోచనీయం అని విమర్శించింది.

United Airlines: అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయిన వందలాది విమానాలు..! కారణం ఏంటంటే..!

ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు వేగంగా పుంజుకోవడం గమనార్హం. రెండు నెలల వ్యవధిలోనే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. గత జూన్‌లో ఆయన వాషింగ్టన్‌కి వెళ్లినప్పుడు, ట్రంప్ స్వయంగా వైట్ హౌస్‌లో విందు ఇచ్చారు. ఆ సమయంలో పాక్‌తో వాణిజ్యాన్ని విస్తరిస్తామని, అక్కడ చమురు నిల్వల వెలికితీతపై అధ్యయనం చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా కూడా పాకిస్థాన్‌లో పర్యటించారు. పాక్ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత సైనిక పురస్కారమైన ‘నిషాన్-ఇ-ఇంతియాజ్’ను ప్రదానం చేసింది. మరోవైపు, కశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత అమెరికాతో ఉన్న సంబంధాలు కొంత ఆమోదయోగ్యంగా లేకపోవడం కూడా గమనించాల్సిన విషయం.

New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

ఈ పరిణామాలన్నీ దక్షిణాసియాలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ధోరణిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన! ఆ మూడు కీలక పథకాలకు శ్రీకారం!
APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...
School Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే! వరుసగా మూడు రోజుల సెలవులు!
Praja Vedika: నేడు (7/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!