ప్రస్తుతం అనేక మంది కొత్త కారు కొనలేనంత స్థితిలో ఉండటంతో, కుటుంబ అవసరాలు లేదా పర్యటనల కోసం సెకండ్ హ్యాండ్ కార్లను ఎంపిక చేస్తున్నారు. అయితే, పాత వాహనాన్ని కొనుగోలు చేయడంలో కొన్ని కీలక విషయాలను గమనించకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ముందు మీ బడ్జెట్‌ను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరలు పరిశీలించి, మీకు సరిపోయే కారును ఎంచుకోవాలి.
కారు స్థితిని అర్థం చేసుకోవాలంటే టెస్ట్ డ్రైవ్, మెకానిక్ తనిఖీ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ ద్వారా వాహనంలో ఉన్న లోపాలు గమనించవచ్చు. అనుభవజ్ఞుడి సలహాతో దీర్ఘ డ్రైవ్ చేయడం ఉత్తమం. అంతేకాదు, కంపెనీ సర్వీస్ సెంటర్ లేదా నమ్మదగిన మెకానిక్ చేత చెక్ చేయించాలి. అలాగే కారుకు సంబంధించిన సర్వీస్ రికార్డులు, పేపర్లు పూర్తిగా పరిశీలించడం కూడా అవసరం. ముఖ్యంగా ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ వంటి వివరాలు ఆర్‌సీతో సరిపోలడాన్ని నిర్ధారించుకోవాలి. ఈ చర్యలతో మీరు నష్టాలను నివారించడమే కాకుండా, మంచి సెకండ్ హ్యాండ్ కారు ఎంపిక చేసుకోగలుగుతారు.