LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

ATM Rules 2026: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏటీఎం విత్‌డ్రాయల్స్, యూపీఐ క్యాష్‌పై కొత్త నిబంధనలు ఇవే..!!

ATM Rules 2026: ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త ఏటీఎం నిబంధనల గురించి తెలుసుకోండి. HDFC బ్యాంక్ యూపీఐ నగదు విత్‌డ్రాయల్ ఛార్జీలు, PNB డెబిట్ కార్డ్ లిమిట్స్ ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ మార్పుల పూర్తి వివరాలు

AndhraPravasi News Desk 2 min read
ATM Rules 2026:  బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏటీఎం విత్‌డ్రాయల్స్, యూపీఐ క్యాష్‌పై కొత్త నిబంధనలు ఇవే..!!

ఏటీఎం ఛార్జీల బాదుడు

విత్‌డ్రాయల్ లిమిట్‌లో మార్పులు

డిజిటల్ బ్యాంకింగ్ వైపు అడుగులు

ATM Rules 2026: వచ్చే ఏప్రిల్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది. బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రాయల్స్, యూపీఐ నగదు లావాదేవీలకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి దిగ్గజ బ్యాంకులు కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. ఈ మార్పుల వల్ల వినియోగదారులు తమ నగదు ఉపసంహరణల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు యూపీఐ (UPI) ద్వారా ఏటీఎంల నుంచి తీసే నగదుకు ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. కానీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ విత్‌డ్రాయల్స్ కూడా నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి కిందకే వస్తాయి. అంటే, మీరు నెలకు పొందే 5 ఉచిత లావాదేవీల్లో యూపీఐ నగదు ఉపసంహరణ కూడా కలిసిపోతుంది. ఈ పరిమితి దాటితే, ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 చొప్పున అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది దీనికి అదనంగా జీఎస్టీ బాదుడు ఎలాగూ ఉంటుంది.

మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెరిగిన సైబర్ నేరాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. గతంలో రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే వీలున్న కొన్ని కార్డులపై ఇప్పుడు పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 75,000 మధ్యకు కుదించింది. అత్యవసరంగా ఎక్కువ నగదు కావాలనుకునే వారికి ఇది ఇబ్బందికర పరిణామమే.

కేవలం ఛార్జీలు పెంచడమే కాకుండా, టెక్నాలజీని వాడుకోవడంలోనూ బ్యాంకులు ముందుంటున్నాయి. జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా 'క్యూఆర్ కోడ్' (QR Code) ఆధారిత నగదు విత్‌డ్రాయల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కార్డు లేకుండానే కేవలం స్కాన్ చేసి డబ్బులు తీసుకునేలా బ్యాంకింగ్ కరస్పాండెంట్ పాయింట్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యాంకులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ పంపే మెసేజ్‌లను, ఈ-మెయిల్స్‌ను గమనించాలి. మెట్రో నగరాల్లో  ఇతర ప్రాంతాల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మారుతుంటుంది కాబట్టి, ప్లాన్ చేసుకుని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్ వల్ల అనవసరపు ఛార్జీలు పడకుండా చూసుకోవడం ముఖ్యం.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…