Vijayawada: విజయవాడలో వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేసినేని చిన్ని!

Vijayawada: నగరంలోని వాంబే కాలనీలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ కలిసి శంకుస్థాపన చేశారు.

Published : 2026-04-19 21:05:00

వాంబే కాలనీలో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్..

శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ..

విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు కేటాయించి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, వాంబే కాలనీలో ఇలాంటి సదుపాయం చాలా అవసరమని, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానికులకు సమావేశాలు, వేడుకలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇలాంటి సౌకర్యం రావడం వల్ల సామాజిక కార్యకలాపాలు మరింత సులభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు అధికారులకు సూచించారు.

Spotlight

Read More →