పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధూ నది జలాల పంపిణీ నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత.. తదితర చర్యలతో పాకిస్థాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేతను పున: సమీక్షించుకోవాలని ఇప్పటికే భారత్ కు పాకిస్థాన్ నాలుగుసార్లు లేఖలు రాసింది. పాకిస్థాన్ లో నీటి సంక్షోభం తలెత్తుతోందని లేఖలో పేర్కొంది. అయితే పాకిస్థాన్ రాసిన లేఖలను భారత్ పట్టించుకోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ను అప్పగిస్తేనే నీటిని విడుదల చేస్తామని తేల్చేసింది. తాజాగా ఇదే విషయంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ ఒప్పందాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు.

ఇది కూడా చదవండి: OTT Movies: ఓటీటీ జాతర.. వీకెండ్కు టాప్ 15 సినిమాలివే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్..!

ఇటీవల జర్మనీ బ్రాడ్ కాస్ట్ కు డీడబ్యూ ఉర్దూ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ లోని పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కు భారత్ నీటిని నిలిపివేయడంపై మండిపడ్డారు. ఇలానే కొనసాగిస్తే మరోసారి యుద్ధం జరగక తప్పదని బుట్టో వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు నాలుగు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని.. భారత్ వైఖరి ఇలానే కొనసాగితే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని తేల్చారు. అయితే పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని కానీ దేశ భద్రత, నీటి హక్కులపై పాక్ ఎక్కడివరకైనా వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు భుట్టో. భారత్- పాకిస్థాన్ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ లోని పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ పేర్కొన్నారు. పాక్ తో చర్చలకు సహకరించాలన్నారు. భారత్ వైఖరిని ఖండించాలని ఈ మేరకు ప్రపంచ దేశాలకు భుట్టో పిలుపునిచ్చారు. భారత్- పాకిస్థాన్ చర్చలతో దక్షిణాసియాలో శాంతి నెలకుంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అమెరికాను కోరారు భుట్టో.

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group