రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక దాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్. దీని వల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది. మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత, ప్రస్తుతం రెండో విడత గ్యాస్ సిలిండర్ అమలులో ఉంది. దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలనే తల్లికి వందనం స్కీమ్‌ను కూడా అమలు చేసింది. ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ. 13 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రభుత్వం డబ్బులు అందించింది. ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్‌లో భాగమైన ‘ఆడబిడ్డ నిధి పథకం’ అమలుకు కూటమి ప్రభుత్వ ప్రణాళికలు ప్రారంభించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ స్కీమ్ కింద నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది.
ఇది కూడా చదవండి: Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఆడబిడ్డ నిధి పథకం’ అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. పథకం అమలులో కీలకమైన ముందడుగు వేస్తూ, దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ పథకం కింద 18 సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. దీంతో ప్రతి లబ్ధిదారికి ఏటా రూ. 18,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. మహిళా శక్తికీ, కుటుంబ ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకూ ఇది తోడ్పడేలా ఉండనుంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి భారీగా రూ. 3,300 కోట్లు కేటాయించడం ద్వారా, ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ స్కీమ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత ముందుగా అమలు చేస్తే బాగుంటుందని మహిళల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: