ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) జిల్లాల పర్యటనలకు తరుచుగా వినియోగించే హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇవాళ (సోమవారం) ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు అదే హెలీకాప్టర్‌ని అధికారులు కేటాయించారు. ఈ హెలీకాప్టర్‌లో తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు కేంద్రమంత్రి వెళ్లేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం రావడంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్‌లో టెక్నికల్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌పై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్‌ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ హెలికాప్టర్‌ని వినియోగించవచ్చా.. లేదా? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ కోరారు. కాగా, విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు ఇవాళ(సోమవారం) పర్యటించారు. బీచ్ రోడ్‌లో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లని పరిశీలించారు. బీచ్ రోడ్ నుంచి రుషికొండ వరకూ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్, ఐపీఎస్ అధికారులు ఆయా వివరాలను సీఎంకు వివరించారు. అనంతరం ఆంధ్ర యూనివర్శిటీలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: