రైతు భరోసా (RYTHU BHAROSA) నిధులను రేవంత్ ప్రభుత్వం ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. రైతు నేస్తం వేదిక నుంచి ఆన్‌లైన్ మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి. రైతు భరోసా వేయగానే విస్తృత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 18 నెలల్లో రైతాంగం కోసం రూ.లక్ష కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: కొత్త రికార్డు సృష్టించబోతున్నాం.. యోగా దినోత్సవ ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష!
తమ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వరి సాగు వేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని మాజీ సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రైతు పండించిన చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతల అందరి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా డబ్బు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తామని అన్నారు. రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పంట పరిహారం గురించి ఎందుకు పట్టించుకోలేదని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: