India Pakistan: భారత్ పాక్ ఆసియా కప్ ఫైనల్ హైటెన్షన్.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోని ప్రధాన స్పోర్ట్స్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల మాధవ్ ప్రకటించారు.

ఏపీ ప్రజలకు శుభవార్త...కొత్త ఇళ్ల పథకంలో కీలక మార్పులు!

చేబ్రోలు మండలం వడ్లమూడి ప్రాంతంలోని ఓ విశ్వవిద్యాలయంలో శనివారం జరుగుతున్న నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రీడల ద్వారా యువత తమ ప్రతిభను నిరూపించుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెస్ వంటి మేధో క్రీడలు ప్రపంచవ్యాప్తంగా భారత క్రీడాకారుల గౌరవాన్ని పెంచుతున్నాయని, ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Tourist: విజయవాడ పర్యాటక రంగానికి నూతన శకం..! ఆ కొండపై లిఫ్ట్ సౌకర్యం!

మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ జిల్లాల్లో స్టేడియాలు, ఇండోర్ కాంప్లెక్సులు, క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఆటగాళ్లకు కావలసిన మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల కోచింగ్ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీయడానికి ‘క్రీడా ప్రోత్సాహక పథకాలు’ కూడా ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.

Hair Care Tips: ఇన్‌స్టాంట్ అందం కోసం.. జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి! దానిని అతిగా వాడితే.!

అదేవిధంగా, ఏపీ నుంచి ఇప్పటికే పలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారని, భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్ మెడలిస్టులు రాష్ట్రం నుంచి వెలువడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధి కోసం కేంద్రం కూడా రాష్ట్రానికి తగిన మద్దతు ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఈగల్ ఐజీ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు సూచించారు.

Obama: వృద్ధ నేతల అధికారం మోజే ప్రపంచ సమస్యలకు మూలం..! బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు!

మాధవ్ చివరగా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ యువతలో ఉన్న ప్రతిభకు ఎలాంటి కొరత లేదు. క్రీడల కోసం సరైన వేదిక, అవకాశాలు కల్పిస్తే ఏపీని దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా స్పోర్ట్స్ డెస్టినేషన్గా నిలబెట్టగలము” అని నమ్మకంగా పేర్కొన్నారు. మొత్తం మీద, రాష్ట్రం క్రీడా రంగాన్ని కేవలం వినోదం కోసం కాకుండా, ఉద్యోగావకాశాలు, ఆరోగ్యకర జీవన విధానం, అంతర్జాతీయ గుర్తింపు పొందే మార్గంగా ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోందని ఆయన హైలైట్ చేశారు.

QR payment Kiwi : చిన్న చెల్లింపులు పెద్ద లాభం.. Kiwi తో ప్రతి QR పేమెంట్‌కి రివార్డు!
GST 2.0: టాటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు..! GST రేట్ల తగ్గింపు, వినియోగదారులకు భారీ లాభం!
అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు – వినియోగదారులు అలర్ట్!
Modi shares: దుర్గానవరాత్రి సందర్భంగా తెలుగు పాటను షేర్ చేసిన మోదీ.. సోషల్ మీడియాలో హంగామా!
సాయిపల్లవి స్టైల్ అంటే ఇదే.. విమర్శకులకు దీటుగా పోస్ట్.. అభిమానుల హర్షం!
AP Highway: ఏపీలో కొత్తగా ఆరు వరుసల రహదారి.. ఆ రూట్లోనే..! డెల్టా నుంచి హైదరాబాద్‌కు నేరుగా స్పీడ్‌గా..!
Oil India: భారత ఇంధన రంగంలో మరో మైలురాయి..! అండమాన్‌లో గ్యాస్ రిజర్వులు వెలుగులోకి..!
Electricity: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..! తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు అమలు..!
Accenture: యాక్సెంచర్ కలకలం..! 11,000 ఉద్యోగులు కోత.. కానీ లాభాలు రికార్డు స్థాయిలో..!